ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, చెన్నై: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా తగిన ఆంక్షలతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఈనెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. గత సడలింపులు, ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంటూ అదనపు సడలింపులను శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈనెల 19వ తేదీ ఉదయం 6 గంటలతో ముగుస్తున్న దృష్ట్యా ఆ తరువాత నుంచి ఈనెల 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ కిందివాటిపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు.
అదే విధంగా.... రాష్ట్రాల మధ్య ప్రభుత్వ, ప్రయివేటు బస్సుల రాకపోకలు. కేంద్రప్రభుత్వం అనుమతించిన మార్గాల్లో మినహా అంతర్జాతీయ విమాన సేవలు, థియేటర్లు, బార్లు, ఈతకొలనులు, ప్రజలు పాల్గొనే సభలు, సమావేశాలు, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు, కాలేజీలు, పాఠశాలలపై నిషేధం ఉందని తెలిపారు. వివాహాలకు 50 మంది, అంతిమసంస్కారాలకు 20 మందికి మాత్రమే అను మతని అన్నారు. షోరూంలు, షాపింగ్ మాళ్లలో ఏసీ వినియోగంలో ఉంటే తలుపులు, కిటికీలు తెరచి ఉంచాలి. ఒకేసారి పెద్ద సంఖ్యలో వినియోగదారులను అనుమతించరాదు. విధులు నిర్వర్తించేచోట ప్రజలు, ఉద్యోగులు మాస్క్, భౌతికదూరం తప్పనిసరి. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాల పంపిణీ నిర్వాహణ పనులకు అవసరమైన మేర పాఠ శాలలకు వెళ్లేందుకు అధ్యాపకులకు అనుమతి ఉందని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment