Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan condoles Death of YV Subbareddy Mother Pitchamma1
వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

సాక్షి, తాడేపల్లి: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యర్రం పిచ్చమ్మ(85) ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. కాగా, పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి. పిచ్చమ్మ పార్థివదేహానికి వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించనున్నారు.

Telangana Assembly Session On March 17th Live Updates2
సీతక్క Vs గంగుల.. తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ

Telangana Assembly Session Updates..👉తెలంగాణ శాసన సభలో ముగిసిన ప్రశ్నోతాలు.👉మొదలైన జీరో అవర్..👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి.కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్‌..బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కామెంట్స్‌..ఏం తెచ్చారు ఏం ఇచ్చారు అని ప్రభుత్వం నన్ను ప్రశ్నిస్తుంది..నాకు కాంగ్రెస్ ఏం ఇచ్చింది?గత ఏడాది బడ్జెట్ నుంచి కేవలం 90 లక్షలు మాత్రమే ఇచ్చింది.కొడంగల్‌కు 1000 కోట్లు తీసుకుపోయారు.శాసన సభకే అవమానం.శాసనసభలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మూడు సమానమే.అసెంబ్లీలో కేటీఆర్‌ చిట్‌చాట్‌.. రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలుసీఎం రేవంత్‌ టార్గెట్‌గా కేటీఆర్‌ కామెంట్స్‌..తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందిరేవంత్ రెడ్డి అప్రూవర్‌గా మారి.. తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పాడు71వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడు2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.‌. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవిపిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు?నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారుమెదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదుకాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడుసంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదురాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ పెరుగుతుందా?కేంద్రంతో సఖ్యతగా ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చాడుకేసీఆర్‌పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నాడుగాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్ పై దృష్టి పెట్టాలి కుటుంబాలు మాకు లేవా?. పిల్లలు మాకు లేరా? రేవంత్‌కే ఉన్నారా?నాకు అడ్డమైన వారితో‌ లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్‌లో దాటిన రేఖలు బయట పెట్టాలా? మంత్రి సీతక్క వర్సెస్‌ గంగుల.. 👉విద్యార్థుల డైట్‌ ఛార్జీలు పెంచాం: మంత్రి సీతక్కగత ప్రభుత్వంతో పోలిస్తే విద్యార్థుల డైట్‌ ఛార్జీలు పెంచాం8-10 తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540 డైట్‌ ఛార్జీలు చెల్లిస్తున్నాంఇంటర్‌ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ.2,100 డైట్‌ ఛార్జీలు చెల్లిస్తున్నాంవిద్యార్థుల డైట్‌ ఛార్జీలకు రూ.499.51 కోట్లు ఖర్చు చేశాం: మంత్రి సీతక్కవిద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దు.విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే.. బీఆర్‌ఎస్‌ ఓర్వలేక పోతుంది.నేను గంగుల కమలాకర్ లెక్క చదువుకోలేకపోవచ్చు.నేను సమాజాన్ని చదివాను.గవర్నమెంట్ స్కూళ్లలో చదివినం. గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాం..సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే నైజం మాదిమా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్య కోసం 167 కోట్లు చెల్లించాముపిల్లలను సరిగా పర్యవేక్షించని సిబ్బంది అధికారులపై చర్యలు ఉంటాయివిద్యార్థులకు స్కాలర్‌షిపులు ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే బాగుండు అని బీఆర్ఎస్ భావిస్తోందిమేము స్కాలర్‌షిప్లు ఇవ్వకపోతే రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ చూస్తోందికానీ మేము బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వము..విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్లు, విదేశీ విద్యానిధి పూర్తిగా చెల్లిస్తున్నాము👉విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి: గంగుల కమలాకర్‌విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలి2016లో కేసీఆర్‌ హయాంలో విదేశీ విద్యా పథకం అమలు చేశారుగతంలో ఏటా 300 మంది విద్యార్థులను పథకం కింద ఎంపిక చేశారుప్రస్తుత ప్రభుత్వం బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకు పథకం కింద ఇచ్చింది గుండు సున్నాజనవరిలో కేవలం 105 మంది ఎస్సీలను పథకం కింద ఎంపిక చేశారుగతంలో 1,050 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశాలకు పంపారుగతంలో రూ.439 కోట్లతో 2,751 మంది మైనార్టీలకు విదేశీ విద్య అందించారు.

Telangana People Dead In USA Road Accident3
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణవాసులు ముగ్గురు మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున 3:30 గంటకు(భారత కాలమానం ప్రకారం) రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి మృతిచెందారు. మృతులను ప్రగతి రెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)గా గుర్తించారు. వీరంతా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని టేకులపల్లి వాసులుగా తెలుస్తోంది. మృతులు మాజీ సర్పంచ్‌ మోహన్‌రెడ్డి కుమార్తె కుటుంబీకులని సమాచారం. వీరి మరణ వార్త తెలియడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Kamindu Mendis Bowl With Two Hands In SRH Intra Squad Match4
IPL 2025: సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌ రేర్‌ టాలెంట్‌

ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభానికి ముందు గత సీజన్‌ రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కఠోరంగా శ్రమిస్తుంది. ఈ సీజన్‌ కోసం చాలా రోజుల కిందటే ప్రాక్టీస్‌ షూరూ చేసిన ఆరెంజ్‌ ఆర్మీ.. ప్రస్తుతం ఇంటర్‌ స్క్వాడ్‌ మ్యాచ్‌లతో బిజీగా ఉంది. నిన్న జరిగిన ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌ కమిందు మెండిస్‌లోని ఓ రేర్‌ టాలెంట్‌ బయటపడింది. కమిందు రెండు చేతులతో బౌలింగ్‌ చేసి వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ తొలి రెండు బంతులను కుడి చేతితో వేసిన కమిందు.. ఆతర్వాత బంతిని ఎడమ చేతితో బౌలింగ్‌ చేశాడు. కమిందు కుడి చేతితో బౌలింగ్‌ చేస్తూ అప్పటికే బౌండరీ బాది జోష్‌ మీదున్న ఇషాన్‌ కిషన్‌ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత బంతికి అభినవ్‌ మనోహర్‌ క్రీజ్‌లోకి రాగా.. అతనికి తన ఎడమ చేతి వాటాన్ని రుచి చూపించాడు. కమిందు రెండు చేతులతో బౌలింగ్‌ చేస్తూ ప్రదర్శించిన వైవిధ్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం సోషల్‌మీడియాలో షేర్‌ చేయగా.. అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. రేర్‌ టాలెంట్‌ అంటూ ఫ్యాన్స్‌ కమిందును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. శ్రీలంక నయా సంచలనం కమిందును ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ సీజన్‌ మెగా వేలంలో రూ. 75 లక్షల బేస్‌ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది.కాగా, ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్‌ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ హోం గ్రౌండ్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌.. ఆర్సీబీతో తలపడనుంది. కేకేఆర్‌ హోం గ్రౌండ్‌ ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌ జరుగనుంది.ఇదిలా ఉంటే, ఈ సీజన్‌ మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ లాంటి విధ్వంకర బ్యాటర్లను వదిలేసి ఇషాన్‌ కిషన్‌, అభినవ్‌ మనోహర్‌, జయదేవ్‌ ఉనద్కత్‌ లాంటి లోకల్‌ టాలెంట్‌ను అక్కున చేర్చుకుంది. మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్‌ భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌ లాంటి నాణ్యమైన పేసర్లను కూడా వదిలేసింది. టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ, గత సీజన్‌ అత్యధిక వికెట్ల వీరుడు హర్షల్‌ పటేల్‌, ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా, శ్రీలంక ఆల్‌రౌండర్‌ కమిందు మెండిస్‌ కొత్తగా జట్టులోకి చేరారు. 2025 ఐపీఎల్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఇదే..పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), అథర్వ్‌ తైడే, అభినవ్‌ మనోహర్‌, అనికేత్‌ వర్మ, సచిన్‌ బేబి, ట్రవిస్‌ హెడ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, కమిందు మెండిస్‌, వియాన్‌ ముల్దర్‌, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఇషాన్‌ కిషన్‌, జీషన్‌ అన్సారీ, మహ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌, రాహుల్‌ చాహర్‌, సిమర్‌జీత్‌ సింగ్‌, ఎషాన్‌ మలింగ, ఆడమ్‌ జంపా, జయదేవ్‌ ఉనద్కత్‌

Arjun Son Of Vyjayanthi Movie Teaser Out Now5
'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' యాక్షన్‌–ప్యాక్డ్‌ టీజర్‌

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ మూవీ టీజర్‌ వచ్చేసింది. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న విజయశాంతి పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ‍ప్రారంభం అవుతుంది. యాక్షన్‌–ప్యాక్డ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా టీజర్‌ ఉంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్‌ పాత్రలో కల్యాణ్‌ రామ్, వైజయంతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ మూవీ తల్లీకొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఫిల్మ్‌ అని తెలుస్తోంది. సోహైల్‌ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ‘యానిమల్‌’ ఫేమ్‌ పృథ్వీరాజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం అజనీష్‌ లోక్‌నాథ్‌ అందించారు.

Nasa confirms Sunitha Williams and Wilmore Return to Earth6
మరికొన్ని గంటల్లో భూమి మీదకు సునీత విలియమ్స్‌.. టైమ్‌ ఎప్పుడంటే?

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 AM గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు) సునీతా విలియమ్స్‌ సహా వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ భూమిపై అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు నాసా ఓ ప్రకటనలో వెల్లడించింది.2024 జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ISS) ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. దీంతో, సునీతా విలియమ్స్ (Sunita williams), బుచ్‌ విల్మోర్‌లు సుమారు తొమ్మిది నెలల అక్కడే గడపాల్సి వచ్చింది..@NASA will provide live coverage of Crew-9’s return to Earth from the @Space_Station, beginning with @SpaceX Dragon hatch closure preparations at 10:45pm ET Monday, March 17.Splashdown is slated for approximately 5:57pm Tuesday, March 18: https://t.co/yABLg20tKX pic.twitter.com/alujSplsHm— NASA Commercial Crew (@Commercial_Crew) March 16, 2025ఈ నేపథ్యంలో వారిని తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట​్‌ ట్రంప్‌ ఆదేశాలతో వారిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు నాసా, స్పేస్‌ఎక్స్‌ రంగంలోకి దిగి ‘క్రూ-10 మిషన్‌’ చేపట్టింది. ఈ క్రమంలో అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో అనుసంధానమైన సంగతి తెలిసిందే. ‘క్రూ-10 మిషన్‌’లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్‌ షెడ్యూల్‌ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణం ఇలా.. అంతరిక్షం నుంచి వారు బయలుదేరే క్రమంలో క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక హ్యాచ్‌ మూసివేత ప్రక్రియ సోమవారం రాత్రి 10.45 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక అన్‌డాకింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ స్పేస్‌షిప్‌ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. సాయంత్రం 5.11 గంటలకు భూ కక్ష్యలను దాటుకుని కిందకు వస్తుంది. సాయంత్రం 5.57 గంటలకు(బుధవారం తెల్లవారుజామున 3:27 AM ప్రకారం) ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్‌ఎక్స్‌ క్యాప్సూల్‌ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది.Crew 10 Dragon vehicle arriving! pic.twitter.com/3EZZyZW18b— Don Pettit (@astro_Pettit) March 16, 2025

Today Gold and Silver Price March 17th 20257
తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..

దేశంలో బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,560 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.110 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,560 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,710 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఈ రోజు (మార్చి 16) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,900 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,02,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

US Green Card Holder Fabian Schmidt was Detained by Immigration Officials8
అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు ఘోర అవమానం

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలో ట్రంప్‌ అధికారం చేపట్టాక దేశంలో పలు ఆంక్షలు అమలవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన విదేశీయులు ఉంటున్న తీరుతెన్నులపై ట్రంప్‌ సర్కారు దృష్టిసారించింది. ఈ నేపధ్యంలో అమెరికన్‌ గ్రీన్‌ కార్టు(American green card) కలిగిన ఒక వ్యక్తి విమానాశ్రయంలో అవమానానికి గురైన ఉదంతం వెలుగు చూసింది.మార్చి 7న జరిగిన ఈ ఘటనలో అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఫాబియన్ స్మిత్‌ను మసాచుసెట్స్‌(Massachusetts)లోని లోగాన్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్మిత్ తన టీనేజ్ నుంచి యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం న్యూ హాంప్‌షైర్‌లో ఉంటున్నారు. అతను లక్సెంబర్గ్ పర్యటన అనంతరం తిరిగి వస్తుండగా, ఈ ఉదంతం చోటుచేసుకుంది. న్యూస్‌వీక్ తెలిపిన వివరాల ప్రకారం స్మిత్‌ను అరెస్టు చేసిన తర్వాత అతని దుస్తులను తొలగించి, విచారణకు తీసుకెళ్లారని అతని కుటుంబం ఆరోపిస్తోంది. స్మిత్ నిర్బంధానికి గల కారణాలు తమకు తెలియవని వారు పేర్కొన్నారు.స్మిత్ గతంలో తన గ్రీన్ కార్డును పునరుద్ధరించుకున్నారు. అతనిపై ఎటువంటి కోర్టు కేసులు పెండింగ్‌లో లేవు. స్మిత్ స్నేహితుడు అతనిని ఆహ్వానించేందుకు విమానాశ్రయానికి వచ్చారు. అయితే అతను ఎంతకీ రాకపోవడంతో అధికారులను సంప్రదించేందుకు నాలుగు గంటలు వేచిచూశారు. స్మిత్‌ తల్లి ఆస్ట్రిడ్ సీనియర్ మీడియాతో మాట్లాడుతూ తన కుమారుని గ్రీన్ కార్డ్ ఫ్లాగ్ అయ్యిందని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనకు చెప్పారన్నారు. అయితే దీని వెనుక గల కారణాలను తెలియజేయలేదన్నారు. 2023లో స్మిత్‌ గ్రీన్ కార్డ్ చట్టబద్ధంగా తిరిగి జారీ చేశారని ఆమె తెలిపారు. దానికి చెల్లుబాటు ఉన్నప్పటికీ, స్మిత్‌ను అమెరికాలోకి రాకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. కాగా ఎవరైనా చట్టాన్ని లేదా వీసా నిబంధనలను(Visa regulations) ఉల్లంఘిస్తే, వారిని అదుపులోకి తీసుకుని బహిష్కరించవచ్చని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అసిస్టెంట్ కమిషనర్ హిల్టన్ బెక్హాం న్యూస్ వీక్‌కు తెలిపారు. ఇప్పుడు స్మిత్ నిర్బంధం వివాదానికి దారితీసింది. అమెరికా వలస విధానాలపై పలు అనుమానాలను లేవనెత్తుతోంది.ఇది కూడా చదవండి: అప్పుడే మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Donald Trump Vladimir Putin Talk on Ukraine Russia war Ceasefire Terms9
త్వరలో ట్రంప్‌-పుతిన్‌ చర్చలు.. కాల్పుల విరమణపై నిర్ణయం?

వాషింగ్టన్‌ డీసీ: రష్యా- ఉక్రెయిన్‌(Russia-Ukraine) మధ్య జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ వారంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.తాజాగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ మీడియాతో మాట్లాడుతూ రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో కాల్పుల విరమణ, శాంతి నిబంధనల దిశగా అమెరికా అధక్షుడు ట్రంప్‌ యోచిస్తున్నారన్నారు. గత వారం పుతిన్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని, యుద్ద నియంత్రణకు పరిష్కారాలు లభించాయని అన్నారు. కాగా పుతిన్ డిమాండ్లలో కుర్స్క్‌లో ఉక్రేనియన్ దళాల లొంగిపోవడం కూడా ఉందా అని ఆయనను మీడియా అడిగినప్పుడు..దానిని ధృవీకరించేందుకు ఆయన నిరాకరించారు.వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. అయితే శాంతి ఒప్పందం కుదిరే ముందు పలు అంశాలపై చర్చలు జరపాల్సి ఉందన్నారు. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు ఇటీవల ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్.. అమెరికా నుండి ఎటువంటి భద్రతా హామీని పొందబోదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు ఘోర అవమానం

these  is no Divine wealth than gods Divine Grace10
ఏది శాశ్వతం? ఏదశాశ్వతం

ఒక మహారాజు ప్రపంచంలో ఎవరూ కట్టించని అద్భుతమైన భవనాన్ని నిర్మింప జేయాలను కున్నాడు. లెక్కలేనంత ధనాన్ని ఖర్చు చేసి, దేశం నలుమూలల నుంచి గొప్ప గొప్ప శిల్పులను పిలిపించి కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో పనిచేయించి గొప్ప భవనాన్ని నిర్మింపజేశాడు. ఆ భవనం విశాలమైన గదులు, ధగ ధగ మెరుస్తున్న కాంతులతో, బంగారు తాపడాల గోడలతో, మంచి శిల్ప నైపుణ్యంతో దేవేంద్ర వైభవాన్ని తలపిస్తూ ఉంది. ఒక రోజు రాజు గృహ ప్రవేశ కార్యక్రమానికిఘనంగా ఏర్పాటు చేసి, దేశం లోని రాజ ప్రముఖులను, విద్వాంసులను, వ్యాపారవేత్తలను, వాస్తు శాస్త్రజ్ఞులను ఆహ్వానించాడు. గృహ ప్రవేశం అయ్యాక, రాజు సభ ఏర్పాటు చేసి, వారితో... ‘ఈ గొప్ప భవనాన్ని ఎంతో ఖర్చు చేసి కట్టించాను. ప్రపంచంలో ఇంత సర్వాంగ సుందరమైన భవనం ఇంకోటి ఉండకూడదు. అందుకని, మీలో ఎందరో ప్రతిభా వంతులు ఉన్నారు. మీరు ఈ భవనాన్ని సమగ్రంగా పరిశీలించి, ఇందులో లోపాలు, దోషాలు ఏమైనా ఉంటే చెప్పండి. సవరణలు చేయిస్తాను. ఇప్పుడే తెలపండి’ అన్నాడు.రాజు మాటలు విని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్య పోయారు. ఇంత అందమైన కట్టడంలో లోపాలా? అనుకున్నారు. అయినా, రాజు మాట కాదనలేక, వారిలో శిల్పులు, వాస్తు శాస్త్రజ్ఞులు భవనమంతా చూసి ఏ లోపం లేదని నిర్ధరించారు. రాజు చాలా సంతోషించాడు. అంతలో, సభాసదులలో నుంచి ఒక సాధువు లేచి నిల్చున్నాడు. ‘రాజా! ఈ భవనంలో రెండు దోషాలున్నాయి’ అన్నాడు. రాజు వినయంగా అవేమిటో తెలపమన్నాడు. అప్పుడా సాధువు, ‘ఈ భవనాన్ని కట్టించినవారు ఎప్పటికైనా చనిపోతారు. ఇది ఒక దోషం. ఈ భవనం కాలగర్భంలో ఎప్పటికైనా కలిసిపోతుంది. ఇది ఇంకో దోషం’ అన్నాడు. అప్పుడు రాజుకు వివేకం ఉదయించింది. ‘ఈ లోకంలో ప్రతిదీ నశించి పోయేదే. నశ్వరమైన భౌతిక సంపదల కోసం, తక్షణఆనందం కోసం ఇంత ఖర్చు చేసి ఇన్ని సంవత్సరాల సమయం వృథా చేశాను కదా. శాశ్వతమైనది దైవం ఒక్కడే! ఆ దైవం ముందు ఇవన్నీ నశ్వరాలే’ అని తెలుసుకున్నాడు. రాజుతో పాటు అందరం తెలుసుకోవలసింది ఇదే! దైవ అనుగ్రహానికే మనిషి పాటుపడాల్సింది. – డా. చెంగల్వ రామలక్ష్మి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణవాసులు ముగ్గురు మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది.

title
కెనడా కొత్త కేబినెట్‌లో ఇద్దరు భారతీయులు

ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్‌ క

title
పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన భార్య ఉషా

title
గ్రీన్‌కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్‌.. అమెరికా పౌరసత్వం కట్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసార

title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Advertisement
Advertisement