సాక్షి, చెన్నై: జ్యుడిషియల్ కస్టడీలో తండ్రి, కొడుకుల మరణం కేసులో విచారణ జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరు నెలల్లోపు దర్యాప్తును ముగించి తీర్పు వెలువరించాలని కింది కోర్టుకు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం గురువారం ఆదేశించింది. తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కులంకు చెందిన జయరాజ్, ఫినిక్స్ అనే తండ్రి కుమారులు జ్యుడిషియల్ కస్టడీలో మరణించిన విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసు విచారణలో భాగంగా సాత్తాన్‌కులం పోలీసులు ఈ ఇద్దర్ని చిత్రహింసలు పెట్టినట్టు తేలింది. ఆ స్టేషన్ సీఐ, ఇద్దరు ఎస్‌ఐలతో పాటు పది మంది పోలీసులు అరెస్టు అయ్యారు. కేసును సీబీఐ విచారిస్తోంది. చార్జ్‌షీట్‌ను మదురై జిల్లా కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఈ నేపథ్యంలో కింది కోర్టులో విచారణ జాప్యంపై హైకోర్టు గురువారం స్పందించింది. కేసును త్వరితగతిన విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆరునెలల్లోపు ఈ ప్రక్రియను ముగించాలని గడువు విధించారు.
చదవండి: కస్టడీ డెత్: సీబీఐ విచారణలో విస్తుపోయే విషయాలు
డీజీపీతో పాటు ఎస్పీ కన్నన్ మెడకు ఉచ్చు
Comments
Please login to add a commentAdd a comment