రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే
తొలిసారిగా ఇక్కడి నుంచి పోటీ
మహాయుతి పొత్తులో భాగంగా ఈ సీటు శివసేన(శిందే)కు కేటాయింపు
పోటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్
అయిననప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ సహకారానికి బదులుగా అమిత్ ఠాక్రేకు బీజేపీ మద్దతు
ముంబై: ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు, మాహిం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెన్నెస్ అభ్యర్థి అమిత్ ఠాక్రేకు బీజేపీ మద్దతు కొనసాగుతుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మాహిం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న ఎమ్మెన్నెస్ అభ్యర్థి అమిత్ ఠాక్రేకు మద్దతు ఇవ్వడంపై బీజేపీ, సీఎం శిందే ఏకాభిప్రాయంతో ఉన్నారని ఫడ్నవీస్ తెలిపారు. మాహింలో శివసేన(శిందే)నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్ , శివసేన(యూబీటీ) అభ్యర్థిగా మహేష్ సావంత్, అమిత్ ఠాక్రేతో తలపడనున్నారు
శిందే నేతృత్వంలోని శివసేనకు చెందిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీ సంప్రదాయ ఓటర్లు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి మారతారని వాదించడంతో దీంతో బీజేపీ, శిందే వర్గం అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలో దింపేందుకు అంగీకరించింది. మహాయుతి కూటమి మిత్రపక్షమైన శివసేన(శిందే) కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫడ్నవీస్ తెలిపారు.
చాలా మంది రెబెల్స్ తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా పార్టీ వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోందని, అయితే కొన్ని స్థానాల్లో మాత్రం స్నేహపూర్వక పోటీ తప్పదని వెల్లడించారు. రాజ్ ఠాక్రే సారథ్యం లోని ఎమ్మెన్నెస్ మహాయుతిలో భాగం కానప్పటికీ ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అధికార కూటమికి మద్దతు ఇచ్చింది. మాహిం 1966లో అవిభక్త శివసేన పుట్టుకకు సాక్షీభూతంగా నిలిచిన ప్రాంతం. అనంతరం 2006లో ఎమ్మెన్నెస్ పార్టీ ప్రకటన కూడా ఇక్కడినుంచే జరిగింది.
‘అజిత్ పవార్–ఆర్.ఆర్.పాటిల్’పై నో కామెంట్..
రాష్ట్రంలోని ప్రతి ప్రధాన రాజకీయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగుబాటుదారుల సవాళ్లను ఎదుర్కొంటోందని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.ముఖ్యంగా, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మంగళవారం తన ఒకప్పటి సహచరుడు,అప్పటి హోం మంత్రి ఆర్‌ఆర్ పాటిల్ తనను వెన్నుపోటు పొడిచారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయల విలువైన నీటిపారుదల కుంభకోణానికి పాల్పడ్డారంటూ తనపై బహిరంగ విచారణ కోరారని తెలిపారు. 2014లో తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫడ్నవీస్ పాటిల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఫైల్‌ను తనకు చూపించారని పవార్ పేర్కొన్నారు. పవార్ ప్రకటనపై ఫడ్నవీస్ స్పందన ఏమిటని ప్రశి్నంచగా ని అడగ్గా, ‘కాంగ్రెస్, అలాగే అప్పటి అవిభక్త నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అజిత్ పవార్‌పై దర్యాప్తు ప్రారంభించిన మాట వాస్తవమేనని కానీ ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి నేనెలాంటి వ్యాఖ్యలూ చేయనని బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment