Amit Thackeray
-
మాహింలో ఎమ్మెన్నెస్‌కే మద్దతు
ముంబై: ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు, మాహిం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెన్నెస్ అభ్యర్థి అమిత్ ఠాక్రేకు బీజేపీ మద్దతు కొనసాగుతుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మాహిం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న ఎమ్మెన్నెస్ అభ్యర్థి అమిత్ ఠాక్రేకు మద్దతు ఇవ్వడంపై బీజేపీ, సీఎం శిందే ఏకాభిప్రాయంతో ఉన్నారని ఫడ్నవీస్ తెలిపారు. మాహింలో శివసేన(శిందే)నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్ , శివసేన(యూబీటీ) అభ్యర్థిగా మహేష్ సావంత్, అమిత్ ఠాక్రేతో తలపడనున్నారు శిందే నేతృత్వంలోని శివసేనకు చెందిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీ సంప్రదాయ ఓటర్లు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి మారతారని వాదించడంతో దీంతో బీజేపీ, శిందే వర్గం అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలో దింపేందుకు అంగీకరించింది. మహాయుతి కూటమి మిత్రపక్షమైన శివసేన(శిందే) కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫడ్నవీస్ తెలిపారు.చాలా మంది రెబెల్స్ తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా పార్టీ వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోందని, అయితే కొన్ని స్థానాల్లో మాత్రం స్నేహపూర్వక పోటీ తప్పదని వెల్లడించారు. రాజ్ ఠాక్రే సారథ్యం లోని ఎమ్మెన్నెస్ మహాయుతిలో భాగం కానప్పటికీ ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అధికార కూటమికి మద్దతు ఇచ్చింది. మాహిం 1966లో అవిభక్త శివసేన పుట్టుకకు సాక్షీభూతంగా నిలిచిన ప్రాంతం. అనంతరం 2006లో ఎమ్మెన్నెస్ పార్టీ ప్రకటన కూడా ఇక్కడినుంచే జరిగింది. ‘అజిత్ పవార్–ఆర్.ఆర్.పాటిల్’పై నో కామెంట్..రాష్ట్రంలోని ప్రతి ప్రధాన రాజకీయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగుబాటుదారుల సవాళ్లను ఎదుర్కొంటోందని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.ముఖ్యంగా, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మంగళవారం తన ఒకప్పటి సహచరుడు,అప్పటి హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ తనను వెన్నుపోటు పొడిచారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయల విలువైన నీటిపారుదల కుంభకోణానికి పాల్పడ్డారంటూ తనపై బహిరంగ విచారణ కోరారని తెలిపారు. 2014లో తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫడ్నవీస్ పాటిల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఫైల్‌ను తనకు చూపించారని పవార్ పేర్కొన్నారు. పవార్ ప్రకటనపై ఫడ్నవీస్ స్పందన ఏమిటని ప్రశి్నంచగా ని అడగ్గా, ‘కాంగ్రెస్, అలాగే అప్పటి అవిభక్త నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అజిత్ పవార్‌పై దర్యాప్తు ప్రారంభించిన మాట వాస్తవమేనని కానీ ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి నేనెలాంటి వ్యాఖ్యలూ చేయనని బదులిచ్చారు. -
బీజేపీ ప్రచార నిర్వహణకు 300 కాల్ సెంటర్లు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రచార నిర్వహణకు బీజేపీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రచార అంశాలను రూపొందించడం, ఓటర్లను ఆకట్టుకునే కార్యక్రమాలు నిర్వహించడమే లక్ష్యాలుగా 300 కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. దేశాన్ని 10 జోన్లుగా విభజించించి, ప్రతి 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున కాల్ సెంటర్‌ను నిర్వహించనుంది. ఇవి ఓటర్లకు నిత్యం ఫోన్ చేసి మేనిఫెస్టోను వివరిస్తాయని బీజేపీ కీలక నేత ఒకరు తెలిపారు. పది జోన్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జ్‌ల నియామకాలను పూర్తి చేసిన పార్టీ అధిష్టానం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ జోన్ ఇన్చార్జ్గా గుజరాత్ ఎమ్మెల్యే అమిత్ థాకర్‌ను నియమించింది. మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ జోన్‌కు బిహార్ బీజేపీ నేత దేవేశ్ కుమార్, ఉత్తరప్రదే శ్–ఉత్తరాఖండ్ ఇన్చార్జ్ గా ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షు డు రాజీవ్ బబ్బర్‌ను నియమించారు. ఈ నేతలు కేంద్ర కార్యాలయంలోని ఐదుగురు ముఖ్యనేతలు, రాష్ట్రాల పరిధిలో కాల్‌సెంటర్ల ఇన్‌చార్జ్‌లను కలుపుకొని ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు. -
అమిత్‌కు విద్యార్థి సేన పగ్గాలు!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)కు అనుబంధంగా ఉన్న విద్యార్థి సేన అధ్యక్షుడిగా అమిత్ ఠాక్రేకు నియమించనున్నారని తెలిసింది. ఇదివరకు విద్యార్థి సేన అధ్యక్ష పదవిలో కొనసాగిన ఆదిత్య శిరోడ్కర్ ఎమ్మెన్నెస్ నుంచి బయటపడి శివసేనలో చేరారు. దీంతో ఖాళీ అయిన ఆ పదవిలో పార్టీ చీఫ్ రాజ్‌ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రేను నియమించేందుకు ఆ పార్టీ పదాధికారులు, కార్యకర్తలు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ పార్టీలో పలువురు సీనియర్ల పేర్లు రేసులో ఉన్నప్పటికీ అమిత్ ఠాక్రేను నియమించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. దీంతో ఈ పదవీ బాధ్యతలు ఎవరికి కట్టబెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నాసిక్‌లో చర్చలు.. ఎమ్మెన్నెస్ ప్రధాన కార్యదర్శి, విద్యార్థి సేన అధ్యక్షుడు ఆదిత్య శిరోడ్కర్ ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో శివసేనలో చేరారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆదిత్య అకస్మాత్తుగా శివసేనలో చేరడం వల్ల ఎమ్మెన్నెస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లైంది. వచ్చే సంవత్సరం బీఎంసీ ఎన్నికలు, భవిష్యత్తులో అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆదిత్య ఇలా అకస్మాత్తుగా పార్టీని విడటం రాజ్ ఠాక్రేతోపాటు ఆ పార్టీ సీనియర్ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రాజ్‌ఠాక్రే నాసిక్ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై చర్చించేందుకు అమిత్‌తోపాటు పలువురు సీనియర్ నాయకులు వెంటనే నాసిక్‌కు రావాలని సందేశం పింపించారు. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై చర్చించినట్లు తెలిసింది. ఇందులో అధిక శాతం అమిత్‌నే నియమించడానికి ఇష్టపడినట్లు తెలిసింది. ఒకవేళ ఈ పదవిలో అమిత్ ఠాక్రేను నియమిస్తే నేటి యువ కార్యకర్తల్లో నవ చైత్యనం నూరిపోసినట్లవుతుంది. దీంతో అమిత్‌నే నియమించాలని పదాధికారులు, కార్యకర్తలు పట్టుబడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాగా ఎమ్మెన్సెస్ సినెట్ సభ్యులు సుధాకర్ తాంబోలి, అఖిల్ చిత్రే, గజానన్ కాళే తదితర సీనియర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కానీ, ముందువరుసలో అమిత్ ఠాక్రే ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో విద్యార్థి సేన అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రారంభంలో ఘనంగా.. అప్పట్లో శివసేన నుంచి బయటపడిన రాజ్‌ఠాక్రే సొంత పార్టీ పెట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను తమ పార్టీలో చేర్చుకుంటామని పేర్కొంటూ 2006 మార్చి 9వ తేదీన ఎమ్మెన్నెస్ పార్టీ స్థాపించారు. ప్రారంభంలో తిరుగులేని పార్టీగా ఎదిగిన ఎమ్మెన్నెస్ ప్రధాన పార్టీలను సైతం దెబ్బతీసింది. ఆ తరువాత జరిగిన బీఎంసీ, నాసిక్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించుకుంది. కాని కాలక్రమేణా పార్టీ ప్రతిష్ట, ప్రాబల్యం దెబ్బతినసాగింది. దీంతో కార్పొరేటర్ల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. చివరకు పార్టీలో ఒక్కరే ఎమ్మెల్యే, ఒక్కరే కార్పొరేటర్ మిగిలారు. ఇది పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పార్టీ కోల్పోయిన ప్రతిష్ట, కార్యకర్తలు కోల్పోయిన మనోధైర్యాన్ని తిరిగి నింపేందుకు శత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగం గా త్వరలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లలో పర్యటించడం, పదాధికారులు, కార్యకర్తలతో సంప్రదించడం లాంటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా సభ్యత నమోదు పథకాన్ని సోషల్ మీడియా ద్వారా చేపట్టి పార్టీలో కార్యకర్తల సంఖ్య పెంచుకోవాలని, అలాగే ప్రజలకు మరిం త దగ్గరవ్వాలనే ప్రయత్నం రాజ్ ఠాక్రే చేస్తున్నా రని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఒకవేళ విద్యార్థి సేన పగ్గాలు అమిత్‌కు దక్కితే పార్టీలో నూతనోత్తేజం రావడం ఖాయమని రాజకీయ వర్గాలో చర్చ నడుస్తోంది. -
‘మర్యాదగా వెళ్తారా.. గెంటెయ్యమంటారా?’
ముంబై: బంగ్లాదేశీయులు వెంటనే భారత దేశాన్ని విడిచివెళ్లిపోవాలని.. లేదంటే తామే వెళ్లగొడతామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్ఎన్ఎస్) నాయకులు బెదిరింపులకు దిగారు. ఈ మేరకు.. ‘‘బంగ్లాదేశీయులు మీరు దేశాన్ని విడిచివెళ్లిపోండి. లేదంటే ఎమ్ఎన్ఎస్ స్టైల్లో మేమే గెంటేస్తాం’’అంటూ రాయ్‌గఢ్ జిల్లాలో ఎమ్ఎన్ఎస్ పేరిట పోస్టర్లు వెలిశాయి. ఇందులో ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఫొటోతో పాటు కొత్తగా రాజకీయాల్లో చేరిన ఆయన కుమారుడు అమిత్ ఫొటోను కూడా బ్యానర్లో చేర్చారు. కాగా నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలుపుతున్నట్లు ఎమ్ఎన్ఎస్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా మహారాష్ట్రలో శివసేన.. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీజేపీతో కలిసి హిందుత్వ జెండాతో ముందుకు సాగేందుకు పార్టీ నిర్ణయించింది. ఇక పార్టీ జెండాలో సైతం పలు మార్పులు చేసింది. హిందుత్వాన్ని ప్రతిబింబించేలా జెండాను పూర్తిగా కాషాయ రంగులోకి మార్చి... మధ్యలో ఛత్రపతి శివాజీ కాలంనాటి రాజముద్రను చేర్చారు. కాగా ఎమ్ఎన్ఎస్ స్థాపించిన సమయంలో.. పార్టీ జెండాను కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులతో తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా... ఎమ్ఎన్ఎస్ ఈ విధమైన పోస్టర్లు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా శివసేన నుంచి బయటికొచ్చిన రాజ్ ఠాక్రే 2006లో ఎమ్ఎన్ఎస్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. (శివసేనకు చెక్.. బీజేపీతో కలిసిన రాజ్‌ఠాక్రే..!) -
ఠాక్రే కుటుంబం నుంచి మరో వారసుడు..
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఠాక్రేల కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి వచ్చారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ ఠాక్రే జయంతి సందర్భంగా గురువారం గోరెగావ్‌లో ఎమ్మెన్నెస్ మహా సభ నిర్వహించింది. ఈ వేదికపై నుంచే ఎమ్మెన్నెస్ సీనియర్ నాయకులు అమిత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అమిత్ మాట్లాడుతూ.. ‘పార్టీ స్థాపించిన 14 ఏళ్లలో తొలిసారిగా నేను ఓ బహిరంగసభలో మాట్లాడుతున్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంద’ని అన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అమిత్ తల్లి షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెన్నెస్‌లో అమిత్‌కు ఏ బాధ్యతలు అప్పగిస్తారనేదానిపై ఆ పార్టీ నేతలు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఎమ్మెన్నెస్ యూత్ వింగ్ బాధ్యతలను అమిత్‌కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ జెండాలో కూడా మార్పులు చేశారు. హిందూత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ఆలోచనలతో పూర్తిగా కాషాయం రంగుతో పార్టీ కొత్త జెండాను రూపొందించారు. జెండా మధ్యలో ఛత్రపతి శివాజీ కాలంనాటి రాజముద్రను చేర్చారు. ఎమ్మెన్నెస్ స్థాపించినప్పుడు.. పార్టీ జెండాను కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులతో తీర్చిదిద్దారు. కాగా, శివసేన నుంచి బయటికొచ్చిన రాజ్ ఠాక్రే 2006లో ఎమ్మెన్నెస్‌ను స్థాపించారు. అనంతరం 2009లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసిన ఎమ్మెన్నెస్.. 13 సీట్లలో గెలుపొందింది. ఆ తర్వాత పలు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీచేసిన కూడా అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాల్లో పోటీచేసిన ఎమ్మెన్నెస్.. ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందడం ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే పార్టీలో పలు మార్పులు చేయాలని ఆలోచనకు వచ్చారు. మరోవైపు ఠాక్రేల కుటుంబం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆదిత్య ఠాక్రే.. వర్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. దీంతో శివసేనకు, బీజేపీకి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి హిందూత్వ ఎజెండాతో ముందుకెళ్లాలని ఎమ్మెన్నెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో రాజ్ ఠాక్రే భేటీ అయిన సంగతి తెలిసిందే. -
లాంచ్ చేయడానికి.. నా కొడుకేమైనా రాకెట్టా?
ముంబై: లాంచ్ చేయడానికి నా కొడుకేమైనా రాకెటా? అంటూ మహారాష్ట్ర నవీనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. ఎంఎన్ఎస్ విద్యార్ధి విభాగం కీలక పదివిని అధిష్టించడం ద్వారా రాజ్ థాక్రే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలని రాజ్ థాక్రే ఖండించారు. లాంచ్ చేయడానికి నా కుమారుడు అమిత్ రాకెట్ కాదు. సరియైన సమయంలో రాజకీయాల్లో ప్రవేశిస్తారు అని రాజ్ థాక్రే అన్నారు. ఎంఎన్ఎస్ విద్యార్ధి విభాగం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ థాక్రే తండ్రితోపాటు పాల్గొన్నారు. ఈసభలో తన మాటల్నే నమ్మాలని.. మీడియా వార్తలను పరిగణనలోకి తీసుకోవద్దు అని అమిత్ అన్నారు. శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే లానే అమిత్ థాక్రే విద్యార్ధి విభాగం ద్వారా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.