లాంచ్ చేయడానికి.. నా కొడుకేమైనా రాకెట్టా? | My son not a rocket to be launched, says Raj Thackeray | Sakshi
Sakshi News home page

లాంచ్ చేయడానికి.. నా కొడుకేమైనా రాకెట్టా?

Published Sat, Jul 12 2014 3:41 AM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM

లాంచ్ చేయడానికి.. నా కొడుకేమైనా రాకెట్టా? - Sakshi

లాంచ్ చేయడానికి.. నా కొడుకేమైనా రాకెట్టా?

ముంబై: లాంచ్ చేయడానికి నా కొడుకేమైనా రాకెటా? అంటూ మహారాష్ట్ర నవీనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. ఎంఎన్ఎస్ విద్యార్ధి విభాగం కీలక పదివిని అధిష్టించడం ద్వారా రాజ్ థాక్రే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలని రాజ్ థాక్రే ఖండించారు. లాంచ్ చేయడానికి నా కుమారుడు అమిత్ రాకెట్ కాదు. సరియైన సమయంలో రాజకీయాల్లో ప్రవేశిస్తారు అని రాజ్ థాక్రే అన్నారు. 
 
ఎంఎన్ఎస్ విద్యార్ధి విభాగం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ థాక్రే తండ్రితోపాటు పాల్గొన్నారు. ఈసభలో తన మాటల్నే నమ్మాలని.. మీడియా వార్తలను పరిగణనలోకి తీసుకోవద్దు అని అమిత్ అన్నారు. శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే లానే అమిత్ థాక్రే విద్యార్ధి విభాగం ద్వారా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement