
సాక్షి, ముంబై: అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు మరోసారి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. శుక్రవారం నుంచి ఆయన లాతూర్ పర్యటనలో ఉన్నారు. శనివారం లాతూర్‌లో ఉండగా అస్వస్ధతకు గురికావడంతో పర్యటన ముగించుకు ని సాయంత్రం ముంబైకి చేరుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆదివారం షోలాపూర్ పర్యటనను కూ డా రద్దు చేసుకున్నారు.
ప్రస్తుతం ఫడ్నవీస్ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యం అందిస్తున్నామని, ఆందోళ న చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. ఇదిలాఉండగా ఈనెల 10న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహంపై ఆదివారం సాయంత్రం సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఫడ్నవీస్‌కు కరోనా కారణంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
చదవండి: బెడిసికొట్టిన ఏకగ్రీవం.. రాష్ట్రంలో 24 ఏళ్ల తరువాత రాజ్యసభ ఎన్నికలు