
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించిన కోవిడ్ మాత్ర మోల్‌ఫ్లూ ధర రూ.35
Dr Reddys To Launch Molflu : కరోనా చికిత్స వాడే మోల్నుపిరావిర్ మాత్ర మోల్‌ఫ్లూ ధరను డా.రెడ్డీస్ ప్రకటించింది. ఒక్కో మాత్ర రూ. 35 చొప్పన త్వరలో మార్కెట్లో విడుదల చేస్తామని తెలిపింది. పదిమాత్రల షీటు రూపంలో ఇవి లభిస్తాయి. అంటే ఒక షీటుకు రూ. 350 చొప్పున పడుతుంది. కరోనా చికిత్సలో భాగంగా ఈ మాత్రలను ఐదు రోజుల పాటు మొత్తం 40 మాత్రలు వాడాల్సి ఉంటుంది.
(చదవండి: భయంకరమైన భారీ పీత!.. గోల్ఫ్ స్టిక్‌ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!)
అంటే పూర్తి చికిత్సకు రూ. 1,400 ఖర్చవుతుంది. అమెరికాలో ఈ మాత్రల పూర్తి కోర్సుకు సుమారు 700 డాలర్లు అంటే దాదాపు రూ. 52 వేల పైచిలుకు ఖర్చవుతుంది. భారత్‌లో అందుబాటులో ఉన్న చికిత్సల్లో ఇదే చౌకని కంపెనీ తెలిపింది. వచ్చే వారం నుంచి మార్కెట్లో ఈ మా త్రలు లభిస్తాయన్నారు. గతవారం ఈ ఔషధ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతిచ్చింది.
(చదవండి: 40 రోజుల్లో 700 మైళ్లు.. ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!)