Capsules
-
వేలడంత లేదు.. వణికిపోతున్న పశ్చిమ ఆస్ట్రేలియా
కాన్బెర్రా: ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఏ క్షణాన ఏం జరుగుతుందో.. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ప్రజలు వణికిపోతున్నారు. వేలు సైజులో కూడా లేని ఓ క్యాప్సూల్ కోసమే ఇదంతా. కనిపిస్తే విపత్తుల నిర్వహణ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఎమర్జెన్సీ నెంబర్లను ప్రకటించారు. ఎందుకంటే ఆ క్యాప్సూల్ మామూలుది కాదు.. రేడియోయాక్టివ్తో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం. ఎనిమిది మిల్లీమీటర్ల పొడవు, ఆరు మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న ఓ చిన్న రేడియోయాక్టివ్ క్యాప్సూల్ అది. కిబంర్లీ రీజియన్‌లోని న్యూమన్ నుంచి పెర్త్‌కు(12 వేల కిలోమీటర్ల దూరం) తీసుకెళ్తున్న సమయంలో.. రోడ్ల కుదుపులతో ట్రక్కు బోల్ట్ తెరుచుకుని అది కింద పడిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దాని కోసం వెతుకలాట నడుస్తోంది అక్కడ. ఆ సిల్వర్ క్యాప్సూల్‌లో సీసియం-137 ఉందని, అది చాలా ప్రమాదకరమని అత్యవసర సిబ్బంది ప్రకటించారు. జనవరి 12వ తేదీనే ఆ ట్రక్కు గమ్యస్థానానికి చేరుకుందని, కానీ.. కనిపించకుండా పోయిన ఆ క్యాప్సూల్ ఆచూకీ ఇప్పటిదాకా లభ్యం కాలేదని అత్యవసర సిబ్బంది వెల్లడించారు. ఈ పదార్థాన్ని మైనింగ్ కార్యకలాపాలలో ఉపయోగిస్తారని, దీని రేడియేషన్ వల్ల శరీరం కాలిపోవడం లేదంటే రేడియేషన్ అనారోగ్యానికి గురికావొచ్చని హెచ్చరించారు అధికారులు. ఇది ఎంత మేర డ్యామేజ్ చేస్తుందనే దానిపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇది అత్యంత ప్రమాదరకమైన వ్యవహారమని చెప్తున్నారు. ప్రస్తుతం పిల్బరా, మిడ్వెస్ట్ గ్యాస్కోయిన్, మిడ్‌ల్యాండ్ గోల్డ్ఫీల్డ్లతో పాటు పెర్త్ మెట్రోపాలిటన్ రీజియన్లలో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. -
అధిక బరువు ఉన్నారా? ఈ బెలూన్ మింగారంటే చాలు.. 20 నిముషాల్లో..!
బరువు తగ్గడానికి అనేక మార్గాలున్నాయి. తమ ఊబకాయం అకస్మాత్తుగా ప్రాణాపాయం వంటి ప్రమాదం తెచ్చిపెట్టేంత ఎక్కువగా (మార్బిడ్ ఒబేసిటీ) ఉంటే... బేరియాట్రిక్ శస్త్రచికిత్స వంటివీ అందుబాటులో ఉన్నాయి. అయితే స్వల్ప, ఓ మోస్తరు ఊబకాయం ఉన్నప్పుడు... పొట్టను కాస్తా... పేగు స్థాయికి కోసేయడం ఇష్టపడని వారికోసం ఇప్పుడు కేవలం ఓ క్యాప్సూల్‌ను మింగించి, అది పొట్టలోకి వెళ్లాక బెలూన్లా ఉబ్బేలా చేయడం ద్వారా ఆహారం తక్కువగా తీసుకునేలా చేస్తూ, బరువు తగ్గించే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. దీన్నే ‘‘స్వాలోవబుల్ గ్యాస్ట్రిక్ బెలూన్’’ అంటారు. దాని గురించి తెలిపే కథనమిది. ఎవరైనా సరే... కాస్త బొద్దుగా ఉంటే పర్వాలేదు. కానీ... అతిగా లావు పెరిగితే ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. అధిక ఊబకాయం కొన్నిసార్లు అకస్మాత్తుగా ప్రాణాపాయాన్నీ తెచ్చిపెట్టవచ్చు. ఓ వ్యక్తి బాడీ–మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) ప్రమాదకరమైన స్థాయికి చేరినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది. పట్టికలో ఉన్న బీఎమ్‌ఐని బట్టి... అది స్వల్ప, ఓ మోస్తరు స్థాయిలో ఉంటే ఆ ఊబకాయాన్ని తగ్గించడానికి ఈ ‘‘గ్యాస్ట్రిక్ బెలూన్’’ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఎలా అమర్చుతారంటే... తొలుత క్యాప్సూల్లా ఉండే ఉబ్బని బెలూన్ను ఊబకాయం ఉన్న వ్యక్తి చేత మింగిస్తారు. అది కడుపులోపలికి వెళ్లాక సరైన స్థానంలో ఉందా అని నిర్ధారణ చేసుకుం టారు. ఆ తర్వాత, దానికి అతుక్కుని ఉన్న సన్నటి ట్యూబ్ ద్వారా నీటిని పంపి, బెలూన్ను ఉబ్బేలా చేస్తారు. ఉబ్బగానే... దానికి అతుక్కుని ఉన్న ట్యూబ్‌ను మెల్లగా బయటకు లాగేస్తారు. ∙ఈ మొత్తం ప్రక్రియ 20 నిమిషాల్లో ముగుస్తుంది. ఈ బెలూన్ కడుపులో 4 – 6 నెలల పాటు ఉంటుంది. ఆ తర్వాత అది స్వాభావికంగానే జారిపోతుంది. ఎలా పని చేస్తుందంటే...? కడుపులోని ఖాళీ ప్రదేశంలో బెలూన్ ఉండటమూ, ఆహారం పట్టడానికి తక్కువ ఖాళీ ప్రదేశం ఉండటంతో కొద్దిగా తినగానే కడుపు నిండిపోయి ఆకలి తీరినట్లు అనిపిస్తుంది. కానీ ఆహారం కొద్దిగానే వెళ్లడంతో, మళ్లీ కొద్దిసేపటికే ఆకలేస్తుంది. అయినప్పటికీ రోజుమొత్తం లో తినే అన్నం పరిమాణం కంటే ఇది తక్కువే ఉండటంతో... కేవలం దేహానికీ, దేహపు జీవ క్రియలకీ అవసరమైన మేరకే తింటారు. ఫలితంగా ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే శరీరపు అదనపు బరువు తగ్గిపోతుంది. ప్రయోజనాలు బాగా అభివృద్ధి చెందిన సాంతికతతో తయారైన ఈ పాలీయూరీథేన్ బెలూన్లు చాలా మృదువుగానూ, ఉపరితలం నునుపుగానూ ఉంటాయి. కాబట్టి కడుపులోని కండరాలు గాయపడటం వంటి అనర్థాలు ఉండవు. కడుపులో ప్రసరించే ఆమ్లాన్ని (యాసిడ్‌ను) ఇది బాగా తట్టుకుంటుంది. ∙దీని సహాయంతో మొత్తం దేహపు బరువులో 15 – 25 శాతం వరకు తగ్గుతుంది. దీన్ని ఉపయోగించిన దాదాపు 95 శాతం మంది, తొలగించాక కూడా దాదాపు ఏడాది పాటు అదే దేహపు బరువు తో కొనసాగుతారు. దేహపు బరువులో కనీసం 5 శాతం తగ్గినా డయాబెటిస్, గుండెజబ్బులు, ఇతరత్రా అనర్థాలు గణనీయంగా తగ్గుతున్నందున ఇది ఉపయోగకరమనే చెప్పవచ్చు. ప్రతికూలతలు అమర్చిన కొత్తలో కడుపులో ఏదో నిండుగా బెలూన్ ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ త్వరలోనే దానికి అలవాటు పడిపోతారు. కేవలం దేహం బరువులో 15 – 25 శాతం మేరకు మాత్రమే తగ్గుతుంది. కాబట్టి మరీ ఆరోగ్యానికి అనర్థం కలిగించేంత బరువు, ప్రాణాపాయం కలిగించేంత బరువు ఉంటే బేరియాట్రిక్ చేయించాల్సి రావచ్చు. స్వల్పం నుంచి ఓ మోస్తరు బరువు వారికీ, ఆపరేషన్ చేయించుకోడానికి వెనకాడేవారికీ గ్యాస్ట్రిక్ బెలూన్ ఓ మార్గం. -
అతి చౌక ధరలో కోవిడ్ మాత్ర కోర్సు!... కేవలం రూ1400
Dr Reddys To Launch Molflu : కరోనా చికిత్స వాడే మోల్నుపిరావిర్ మాత్ర మోల్‌ఫ్లూ ధరను డా.రెడ్డీస్ ప్రకటించింది. ఒక్కో మాత్ర రూ. 35 చొప్పన త్వరలో మార్కెట్లో విడుదల చేస్తామని తెలిపింది. పదిమాత్రల షీటు రూపంలో ఇవి లభిస్తాయి. అంటే ఒక షీటుకు రూ. 350 చొప్పున పడుతుంది. కరోనా చికిత్సలో భాగంగా ఈ మాత్రలను ఐదు రోజుల పాటు మొత్తం 40 మాత్రలు వాడాల్సి ఉంటుంది. (చదవండి: భయంకరమైన భారీ పీత!.. గోల్ఫ్ స్టిక్‌ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!) అంటే పూర్తి చికిత్సకు రూ. 1,400 ఖర్చవుతుంది. అమెరికాలో ఈ మాత్రల పూర్తి కోర్సుకు సుమారు 700 డాలర్లు అంటే దాదాపు రూ. 52 వేల పైచిలుకు ఖర్చవుతుంది. భారత్‌లో అందుబాటులో ఉన్న చికిత్సల్లో ఇదే చౌకని కంపెనీ తెలిపింది. వచ్చే వారం నుంచి మార్కెట్లో ఈ మా త్రలు లభిస్తాయన్నారు. గతవారం ఈ ఔషధ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతిచ్చింది. (చదవండి: 40 రోజుల్లో 700 మైళ్లు.. ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!) -
ఉగాండా మహిళ పొట్టలో కేజీ కొకైన్
న్యూఢిల్లీ: ఉగాండా దేశానికి చెందిన మహిళ నుంచి సుమారు కిలో బరువున్న కొకైన్ అనే మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ) కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికురాలు కొన్ని రోజుల క్రితం ఉగాండా నుంచి ఢిల్లీకి వచ్చింది. విమానాశ్రయంలో అధికారులు ఆమె కదలికలు, ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆమె క్యాప్యూళ్ల రూపంలో ఉన్న కొకైన్‌ను మింగినట్లు ఒప్పుకుంది. వెంటనే ఆస్పత్రిలో ఆమెకు పరీక్షలు చేయించగా అనేక క్యాప్యూళ్లు పెద్ద పేగు వద్ద చిక్కుకుని ఉన్నట్లు తేలింది. దీంతో నిపుణుల పర్యవేక్షణలో వాటన్నిటినీ బయటకు తీసేందుకు కొన్ని రోజులు పట్టింది. మొత్తం 992 గ్రాముల బరువున్న 91 క్యాప్సూళ్లు బయటపడ్డాయి. వీటిల్లో ఉన్నది సుమారు రూ.14 కోట్ల విలువైన కొకైన్ అని ధ్రువీకరించుకున్నారు. ఈ మేరకు సదరు మహిళను అరెస్ట్ చేసి, ఈనెల 29వ తేదీన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈనెల మొదటి వారంలో నైజీరియా మహిళ నుంచి ఐజీఐ అధికారులు 2,838 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
నరకయాతన లేని చావు.. తిట్టిపోస్తున్న జనం!
Suicide Pods Are Now Legal In Switzerland: హిట్లర్.. నాజీ సైన్యం తమ శత్రువులను గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేదని, పారిపోయేందుకు ప్రయత్నించే వాళ్లను కిమ్ జోంగ్ ఉన్ గ్యాస్ ఛాంబర్లో తోసేసి శిక్షించేవాడని కథనాలు చదివాం కదా. ఇది అందుకు ఏమాత్రం తీసిపోని విషయం. అందుకే జనాలకు అంతలా తిట్టిపోస్తున్నారు. ‘చావుపుట్టుకలు మన చేతుల్లో ఉండేవి కావు’.. ఇది ఎప్పటికీ అక్షర సత్యం. కానీ, చావును సైతం చెప్పుచేతుల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది?. ప్రత్యేక చట్టాలు అనుమతితో కారుణ్య మరణాలు కొనసాగుతున్న వేళ.. విమర్శలెన్ని వినిపించినా ‘తగ్గేదే లే’ అంటున్నాయి కొన్ని దేశాలు. తాజాగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. నొప్పి లేకుండా కేవలం నిమిషాల్లో.. అదీ ప్రశాంతంగా చనిపోవచ్చంటూ ప్రత్యేక క్యాప్సూల్స్ వాడకానికి అనుమతులు ఇచ్చింది స్విస్ ప్రభుత్వం. సార్కో క్యాప్సూల్‌గా పిలిచే ఈ పేటికలను లోపల పడుకునే వ్యక్తే ఆపరేట్ చేసుకోగలగడం, ఎక్కడికంటే అక్కడికి మోసుకెళ్లడమే అసలు ప్రత్యేకతలు. ఈ ప్యాడ్‌లో పడుకున్న వ్యక్తిని ముందుగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత యాక్టివ్ బటన్‌ను నొక్కేందుకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇస్తారు. బటన్ నొక్కగానే నైట్రోజన్ వాయువు రిలీజ్ అవుతుంది. కేవలం 30 సెకన్లలో ఆక్సిజన్ లెవల్ 21 శాతం నుంచి 1 శాతానికి పడిపోతుంది. స్పృహ కోల్పోయిన వ్యక్తి నిమిషాల వ్యవధిలోనే ప్రాణం విడుస్తాడు. ఈ ప్రాసెస్‌లో కణజాలానికి తక్కువ ఆక్సిజన్ పంపిణీ (hypoxia) రక్తంలో కార్బన్ డై యాక్సైడ్ లెవల్ తక్కువ కావడం(hypocapnia) ద్వారా మరణం సంభవిస్తుంది. క్యాబిన్లో ఉన్న వ్యక్తి స్పృహలోకి జారుకునే క్రమంలో.. కంటి చూపు తప్ప శరీర కదలికలు పని చేయవు. తద్వారా ప్రాణం పోయేటప్పుడు గిలగిలలాడేందుకు వీలు కూడా ఉండదు అంటున్నారు డాక్టర్ ఫిలిప్ నిట్స్‌చెకే. ఆస్ట్రేలియాకు చెందిన ఎగ్జిట్ ఇంటర్నేషనల్ (నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్) డైరెక్టర్, డాక్టర్ డెత్‌గా పేరున్న ఫిలిప్ నిట్స్‌చెకే ఈ క్యాప్సుల్‌ను రూపొందించాడు. చట్టబద్ధత ఉంది! అసిస్టెడ్ సూసైడ్‌కు స్విట్జర్లాండ్‌లోనూ చట్టబద్దత ఉంది. కిందటి ఏడాది 1,300 మంది ఇలా చనిపోయారు కూడా(ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు). అదీ లిక్విడ్ సోడియం పెంటోబార్బిటల్ను ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి చనిపోయేలా చేసేవాళ్లు. ఇక ఇప్పుడు సార్కో క్యాప్సూల్స్ ద్వారా అనుమతి ఇచ్చారు. అయితే ఈ అనుమతి ఆత్మహత్యలకు వుసిగొల్పేలా ఉందంటూ ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ స్విస్ ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు. ఇక ఎగ్జిట్ ఇంటర్నేషనల్ ఇప్పటికే రెండు మోడల్స్ సార్కో లను తయారు చేసింది. ఇప్పుడు రూపొందించింది త్రీడీ ప్రింట్ టైప్. కాకపోతే వచ్చే ఏడాది నుంచి ఇది స్విస్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఆర్టికల్ కేవలం సమాచారం అందించే ఉద్దేశంతో రాయబడింది -
ప్రాణం తీసిన విషవాయువు
అనంతగిరి: పసుపు నిల్వకు వినియోగించే గుళికల వాసనతో అస్వస్థతకు గురై ఓ విద్యార్థి మృతి చెందాడు. ఇదే ఇన్ఫెక్షన్తో బాలుడి తల్లి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులు, స్థానికుల వివరాల ప్రకారం వికారాబాద్‌లోని బీటీఎస్ కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభాకర్‌రెడ్డి, భార్య అమ్రేషా, కూతురు, కుమారుడితో కలిసి ఉంటున్నారు. రంజిత్‌రెడ్డి భృంగీ స్కూల్లో 9వ తరగతి చదువుతుండేవాడు. ఈయన స్వగ్రామం వికారాబాద్ మండలం పీలారం. గ్రామంలో గతేడాది సాగు చేసిన పసుపు పంటను వికారాబాద్‌లోని ఇంట్లో నిల్వ ఉంచాడు. పసుపు పాడవకుండా గుళికలు కలిపాడు. ప్రభాకర్ రెడ్డి మంగళవారం పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్లాడు. రాత్రి ఇంటికి కూడా రాలేదు. అయితే ఇంట్లో భార్య అమ్రేషా, కుమారుడు రంజిత్‌రెడ్డి ఉన్నారు. పసుపు నిల్వకు సంచుల్లో మందు గుళికలు వేశారు. గుళికలు వేసిన సంచులకు మూతసరిగా కట్టలేదు. దీంతో ఆ గుళికల వాసన ఇళ్లంతా వ్యాపించింది. ఈ మందు భోజనంలో కలిసిపోయింది. ఈ విషయం తెలియక తల్లీకొడుకులు సాయంత్రం భోజనం చేశారు. దీంతో మంగళవారం రాత్రంతా ఇద్దరు వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. అలాగే సృహతప్పి పడిపోయారు. బుధవారం ఉదయం 9 గంటలైనా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడాన్ని గమనించి స్థానికులు తలుపు కొట్టారు. నీరసంగా ఉన్న అమ్రేషా తలుపు తీసి జరిగిన విషయం చెప్పింది. వారు వెంటనే అమ్రేషాతో పాటు కుమారుడు రంజిత్‌రెడ్డిని వికారాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. రంజిత్‌రెడ్డి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అమ్రేషా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. కాగా ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం వెళ్లగా ఘటన తెలియడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. -
సైన్స్ కాంగ్రెస్‌లో టైమ్ క్యాప్సూ్యల్
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వేదిక లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)లో శుక్రవారం ఒక చారిత్రక ఘట్టం నమోదు అయింది. ప్రస్తుతం మనుషులు రోజూ వాడుతున్న పరికరాలను టైమ్ క్యాప్సూ్యల్(కాలనాళిక)లో ఉంచి భూగర్భంలో నిక్షిప్తం చేశారు. నోబెల్ అవార్డు గ్రహీతలు డంకన్ హాల్డెన్, అవ్ రామ్ హెర్‡్ష కోవ్, థామస్ సుడాఫ్ ఒక మీట నొక్కగానేప్రత్యేకంగా తయారైన ఉక్కు అల్మారా భూమికి పది అడుగుల లోతైన గుంతలోకి వెళ్లింది. ఎల్పీయూలోని యునిపోలిస్ ఆడిటోరియంలో నిక్షిప్తమైన క్యాప్సూ్యల్‌ను 100 సంవత్సరాల తర్వాత తెరుస్తారు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్ టాప్, డ్రోన్, వీఆర్ గ్లాస్, ఎలక్ట్రిక్ కుక్ టాప్‌లతో పాటు భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పురోగతికి గుర్తుగా మంగళ్యాన్, తేజస్ యుద్ధ విమానం, బ్రహ్మోస్ క్షిపణి నమూనాలను అందులో దాచినట్లు ఎల్పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తెలిపారు. మెచ్చినట్లుగా ముత్యాల తయారీ! ముత్యపు చిప్పలోకి ప్రత్యేక పద్ధతిలో ముత్యపు కేంద్రకాన్ని చొప్పించడం ద్వారా మనకు నచ్చిన ఆకారంలో ముత్యాలను తయారు చేసుకోవచ్చునని భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జేకే జెన్నా తెలిపారు. వినాయకుడి విగ్రహం మొదలుకొని వేర్వేరు ఆకారాల్లో వీటిని తయారు చేయవచ్చని తెలిపారు. పరిజ్ఞానం 15 ఏళ్లుగా ఉన్నా మానవవనరుల కొరత కారణంగా ప్రాచుర్యం పొందలేదన్నారు. -
ఒక్క మాత్రతో వారం మందులు!
పూటపూటకూ మాత్రలు మింగాలంటే ఎవరికైనా చిరాకే. అందుకే చాలామంది మాత్రలేసుకోవడం మరచిపోతూంటారు కూడా. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన మాత్రను సిద్ధం చేశారు. వారానికి ఒక్కసారి వేసుకుంటే చాలు. ఈ క్యాప్సూల్‌లోని ఆరు అరలు రోజుకొకటి చొప్పున విచ్చుకుని అవసరమైన మందులు అందిస్తాయి. ఈ మాత్రలపై జరిగిన క్లినికల్ పరీక్షలు కూడా విజయవంతం కావడంతో త్వరలోనే ఇవి మార్కెట్లోకి వచ్చేస్తాయని అంచనా. నక్షత్రపు ఆకారంలో ఉండే అరలు.. వాటిలో మందులు.. ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒక అర విచ్చుకుని మందులు విడుదల కావడం.. ఖాళీ అరలు సహజసిద్ధంగా నాశనం కావడం. ఇదీ స్థూలంగా ఈ క్యాప్సూల్ పని చేసే తీరు. రెండేళ్ల క్రితమే ఈ ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఈ క్యాప్సూల్‌ను పందులకు మలేరియా మందుల రూపంలో అందించడం ద్వారా పరీక్షించారు. తాజాగా ఎనిమిది మంది మనుషులకు అటై్జమర్స్ వ్యాధికి ఇచ్చే మందు 50 మిల్లీగ్రాములను అందించారు. వారం తరువాత జరిపిన పరీక్షల్లో మందు శరీరంలోకి శోషించుకోబడిందని, అవసరమైన మేరకు మందు విడుదలైందని స్పష్టమైంది. ఆక్సిజన్ అందించే చెప్పులు మధుమేహుల కాలి అల్సర్లను వేగంగా మానేలా చేసేందుకు పర్డ్యూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త ఆయుధాన్ని అందుబాటులోకి తెచ్చారు. అల్సర్ ఉన్న ప్రాంతానికి నేరుగా ఆక్సిజన్‌ను అందించే చెప్పుల అడుగుభాగం (సోల్) ను వీరు తయారుచేశారు. పాలిడైమిథైల్సైలోక్సేన్ అనే ప్రత్యేక పదార్థంతో తయారైన ఈ రెండు పొరల సోల్.. అడుగు పొరలో ఆక్సిజన్ అర ఉంటుంది. పై పొరను ఆక్సిజన్‌ను మాత్రమే ప్రసారం చేసేలా లేజర్ కిరణాల సాయంతో కొన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ సోల్‌తో కూడిన కాలిజోళ్లు వేసుకుని నడిచినప్పుడు కింది పొరపై ఒత్తిడి కారణంగా అరలోని ఆక్సిజన్ విడుదల, అల్సర్ ఉన్న ప్రాంతాన్ని నేరుగా తాకుతుంది. దీనివల్ల గాయం వేగంగా మానేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం వాడే హైపర్బేరిక్ ఆక్సిజన్ ట్రీట్మెంట్లో రోగి కదలికల్లేకుండా ఒకచోట కూర్చోవాల్సి వస్తే.. తాజా ఆవిష్కరణతో రోజువారి పనులు సులువుగా చేసుకోవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే.. వీటిని రోగి కాలి ఆకారం, సైజులకు అనుగుణంగా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా అక్కడికక్కడే తయారు చేసుకోవచ్చు. కేన్సర్ నిర్ధారణకు కొత్త రక్తపరీక్ష కేన్సర్ వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మేలు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాధి నిర్ధారణ కూడా సమస్యలతో కూడుకుంది. కణితి భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా వేరు చేయడం, పరీక్షించడం వల్ల వ్యాధి వేగంగా విస్తరిస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో కేవలం రక్త పరీక్షలతోనే కేన్సర్‌ను నిర్ధారించేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ప్రిన్సెస్ మార్గరెట్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ విషయంలో విజయం సాధించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న లిక్విడ్ బయాప్సీ పద్ధతులకు ఎపిజెనిటిక్స్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీలను జోడించి అభివృద్ధి చేసిన ఈ కొత్త పద్ధతి కేన్సర్‌ను గుర్తించడం తో పాటు ఏ దశలో ఉన్నది కూడా తెలియజేస్తుంది. కేన్సర్ తాలూకు లక్షణాలు కనిపించక ముందే వ్యాధిని గుర్తించడం వల్ల చికిత్స సులువవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ డేనియల్ కార్వాలో తెలిపారు. ప్రస్తుత పద్ధతులు, జన్యు క్రమంలో వచ్చిన మార్పులు.. డీఎన్ఏ ముక్కల ఆధారంగా నిర్ధారణ జరుగుతూంటే, కొత్త పద్ధతిలో ఎపిజెనిటిక్స్ ఆధారంగా జరుగుతోంది. ఒక్కో రకమైన కేన్సర్‌కు ఈ మార్పులు వేర్వేరుగా ఉంటాయని, తగు స్థాయిలో ఉన్న ఈ మార్పులను మెషీన్ లెర్నింగ్ ద్వారా గుర్తించడం ఈ కొత్త పద్ధతి ప్రత్యేకత అని వివరించారు. -
వారం రోజుల మందులు ఒక్క క్యాప్సూల్‌లో
హెచ్ఐవీతో బాధపడుతన్న వారికో శుభవార్త. రోజూ బోలెడన్ని మాత్రలు తీసుకోవాల్సిన శ్రమ త్వరలోనే తప్పనుంది. వారం రోజులకు సరిపడా మందులన్నింటినీ ఒకే ఒక్క క్యాప్సూల్లోకి చేర్చడంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు విజయం సాధించడం దీనికి కారణం. క్యాప్సూల్‌లోని మందులు నెమ్మదిగా విడుదల అవడం ద్వారా హెచ్ఐవీ వైరస్ నుంచి వారం పాటు రక్షణ కల్పిస్తాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త గియోవానీ ట్రావెర్సో తెలిపారు. లైండ్రా అనే ఫార్మా కంపెనీ ఇప్పుడు ఈ సరికొత్త క్యాప్సూల్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే ప్రయత్నాల్లో ఉంది. వేర్వేరు మందులను ఒక్కచోటికి తీసుకు రాగల టెక్నాలజీ ఒక్క హెచ్ఐవీకి మాత్రమే కాకుండా అనేక ఇతర వ్యాధులకూ ఉపయోగపడుతుందని ట్రావెర్సో అంటున్నారు. యాంటీ రెట్రోవైరల్ మందులు అందుబాటులోకి వచ్చిన తరువాత హెచ్ఐవీ మరణాల రేటు గణనీయంగా తగ్గినప్పటికీ, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడంలో జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ కొంతమంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో లైండ్రా ఈ సరికొత్త క్యాప్సూల్‌ను అభివృద్ధి చేయడం విశేషం. ఆరు మూలలతో నక్షత్రం ఆకారంలో ఉండే ఈ క్యాప్సూల్ ఒక్కసారి కడుపులోకి చేరితే దాదాపు రెండు వారాలపాటు మనగలదు. ఈ కాలంలో ఒక్కో మూలలో ఉండే మందు క్రమేపీ విడుదలవుతూ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుందన్నమాట. ఎప్పుడు ఏ మందు విడుదల కావాలో తయారీ సమయంలోనే నిర్ణయించుకోగలగడం ఇంకో విశేషం. -
నెల మొత్తానికి ఒకే క్యాప్సూల్
కొంతమంది రోగులకి ప్రతిరోజూ మాత్రలు వేసుకోవాలంటే పరమ చిరాకు. అందుకే ఒకసారి వేసుకుంటే మళ్లీ నెల రోజుల పాటు వేసుకోవాల్సిన అవసరం లేని కొత్త క్యాప్సూల్‌ను మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బ్రైగమ్ ఉమెన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. మాత్ర రూపంలోనే ఉండే ఈ క్యాప్సూల్‌ను ఒక సారి వేసుకుంటే అందులోని మందు ఏరోజుకారోజు కావాల్సినంత మోతాదులో శరీరంలోకి విడుదల చేస్తుంది. శరీరంలోని పరాన్న జీవుల దుష్ప్రభావాన్ని తగ్గించే ఇవెర్‌మెసిటిన్ అనే మందును ఈ కొత్త క్యాప్సూల్ ద్వారా జంతువులపై విజయవంతంగా పరీక్షించారు. సాధారణ ఆకారం, పరిమాణం ఉన్న ఈ కొత్త క్యాప్సూల్ ఒకసారి కడుపులోకి చేరగానే నక్షత్రం ఆకారంలోకి మారిపోతుంది. తద్వారా పేగుల్లోకి జారిపోకుండా ఉంటుంది. ఇలాంటి క్యాప్సూల్‌తో సాంక్రమిక వ్యాధులకు చికిత్స అందించడం మరింత సులువు అవుతుందని అంచనా. వేసుకోవాల్సిన మందులను ప్రతిరోజూ గుర్తుంచుకోవడం కష్టమయ్యే వారికి ఈ క్యాప్సూల్ ఎంతో మేలు చేస్తుందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న సి.జియోవానీ ట్రావెర్సో తెలిపారు. ఈ కొత్త క్యాప్సూల్స్ ద్వారా మందులు పనిచేసే సామర్థ్యంకూడా పెరుగుతుందని, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయని అంటున్నారు. న్యూరోసైకియాట్రిక్ మందులను ఈ కొత్త క్యాప్సూళ్ల ద్వారా ప్రపంచానికి అందించే ప్రయత్నం చేస్తున్నామని లైండ్రా కంపెనీ వ్యవస్థాపకుడు ఆండ్రూ బెలింగర్ తెలిపారు. -
చేప నూనెల కాప్స్యూల్స్ మంచివే..
చేప నూనెలతో కూడిన కాప్స్యూల్స్ తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వులు కలిగించే దుష్ర్పభావాలను తగ్గించుకోవచ్చునని బ్రెజిల్‌లోని సాపాలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిరూపించారు. ఊబకాయాన్ని నివారించేందుకు, మధుమేహాన్ని అడ్డుకునేందుకు ఇవి ఎంతో మేలు చేస్తాయని పేర్కొంటున్నారు. కొవ్వు పదార్థాలపై చేప నూనెలోని ఒమేగా 3 ఫాటీఆమ్లాల ప్రభావంపై శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపారు. నాలుగు వారాల పాటు వాటికి అధికంగా కొవ్వులున్న ఆహారపదార్థాలను అందించారు. ఆ తర్వాత వీటికి చేపనూనెలను ఇచ్చారు. వీటి కొవ్వులను చేపనూనె తీసుకోని ఎలుకల కొవ్వుతో పోల్చిచూశారు. చేపనూనెలు తీసుకున్న ఎలుకల్లో ఇన్సులిన్ నిరోధకత తక్కువగా ఉందని, జీవక్రియలు మరింత మెరుగ్గా ఉన్నాయని మారియా ఇసబెల్ అలోన్సో అనే పరిశోధకుడు పేర్కొన్నారు. ఊబకాయాన్ని, ఇన్సులిన్ నిరోధకతను ఎదుర్కొనేందుకు చేపనూనెలను తీసుకోవడం ఎంతో మేలని తమ పరిశోధన స్పష్టం చేస్తోందని ఆమె తెలిపారు.