నాగ్‌పూర్:ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర సరిహద్దులో సోమవారం(అక్టోబర్ 21) భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు.
మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్‌ను నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోప్రి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కమాండో టీం కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఇటీవలే భారీ ఎన్‌కౌంటర్.. 40 మంది మావోయిస్టులు మృతి
వరుస ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాల వేళ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్ జరిగి నెల గడవక ముందే తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు.
ఇదీ చదవండి: ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదు: అమిత్ షా
Comments
Please login to add a commentAdd a comment