అందరి కడుపు నింపే రైతన్న కడుపు మండింది. అందరి ఆకలి తీర్చే రైతులు నిద్రాహారాలు పట్టించుకోకుండా ఢిల్లీ సరిహద్దులోని సింఘా వద్ద చలిని సైతం లెక్క చేయకుండా ఆందోళన దీక్షలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి ఉద్యమానికి క్రీడాకారులు, కళాకారులు, రచయితలు, పౌర హక్కుల కార్యకర్తలు మద్దతు తెలిపారు. తాజాగా భారత జవాన్లు కూడా వీరి పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో 25 వేల మంది జవాన్లు శౌర్య చక్ర అవార్డులను వెనక్కి ఇచ్చేయనున్నట్లు ఓ వార్తాపత్రిక కథనం వెలువరించింది. దీనికి సంబంధించిన క్లిప్పింగులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. (ఆ పోలీస్‌కు భార్యంటే భయం! అందుకే..)
దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ తప్పుడు వార్తగా కొట్టిపారేసింది. అసలు ఇప్పటివరకు కేవలం 2048 మందికి మాత్రమే శౌర్య చక్ర అవార్డులను ప్రదానం చేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ(ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో) అసత్య కథనాన్ని ఖండిస్తూ ట్వీట్ చేసింది. 1956 నుంచి 2019 మధ్య 2048 మంది జవాన్లు మాత్రమే శౌర్య చక్ర అవార్డులు అందుకున్నారని పేర్కొంది. కాబట్టి 25 వేల మంది జవాన్లు శౌర్య చక్ర అవార్డులను వెనక్కు ఇవ్వడమనేది ఫేక్ న్యూస్. ఎందుకంటే అంతమందికి ప్రభుత్వం శౌర్యచక్ర అవార్డులను ఇవ్వనేలేదు. (రైతు నిరసనలు: 18 రోజుల్లో 20 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment