Shaurya Chakra
-
నీ కడుపుకోత తీర్చలేం.. ‘జై హింద్ మాజీ’
సాక్షి, ఇంటర్నెట్: తల్లి ప్రేమ గురించి పూర్తిగా చెప్పడానికి ఈ ప్రపంచంలో సరైన పదాలు లేవు. అమ్మ అన్న పిలుపులో అమృతం ఉంటుంది. అందుకే దేవతలు సైతం.. ఆ ప్రేమను పొందడానికి మనుషులుగా పుడతారని చెప్పుకుంటారు. అంత గొప్పది తల్లి మనసు. తాను ఎలాంటి స్థితిలో ఉన్నా సరే బిడ్డ క్షేమం, సుఖసంతోషాల గురించి అనునిత్యం పరితపిస్తుంది. తన ఆయుషు కూడా పోసుకుని బిడ్డ నిండ నూరేళ్లు.. చల్లగా బతకాలని కోరుకుంటుంది తల్లి. అటువంటిది.. తన కళ్ల ముందే బిడ్డ మరణిస్తే.. ఆ తల్లి కడుపుకోతను తీర్చే శక్తి ఎవరికి లేదు. ఆమె బాధ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. అది చూసి ప్రతి ఒక్కరి మనసు బాధతో విలవిల్లాడుతోంది. ఆ వివరాలు.. శత్రువులతో భీకరంగా పోరాడి వీర మరణం పొందిన అమరులకు బుధవారం ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేశారు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో 2019లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ బిలాల్ అహ్మద్ మాగ్రే వీర మరణం పొందారు. ఈ ఆపరేషన్‌లో మాగ్రే తీవ్రంగా గాయపడినప్పటికి తన ప్రాణాలను పణంగా పెట్టి.. ముష్కరులతో భీకరంగా పోరాడి.. పౌరులను కాపాడాడు. ఈ క్రమంలో ఆయన మృతి చెందారు. మాగ్రే సాహసానికి గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు సైన్యంలో మూడవ అత్యున్నత పురస్కారం అయిన శౌర్య చక్రను ప్రకటించింది. (చదవండి: ఎన్కౌంటర్లతో దద్దరిల్లిన కశ్మీర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా కొడుకు తరఫున ఈ పురస్కారాన్ని ఆందుకోవడానికి మాగ్రే తల్లి సారా బేగం ఢిల్లీకి వచ్చారు. ఇక అవార్డు ప్రకటించిన అనంతరం నాటి భద్రతా ఆపరేషన్‌లో మాగ్రే చూపించిన సాహసం.. ప్రాణాలు పణంగా పెట్టి ముష్కరులను ఎదిరించిన తీరు.. పౌరులను కాపాడిన విధానం గురించి వర్ణించారు. కొడుకు పేరు మైక్‌లో వినపడగానే ఆ తల్లి పేగు కదిలింది. బిడ్డ జీవితం అంతా ఆమె కళ్ల ముందు మెదిలింది. ఇక కుమారుడు లేడనే వాస్తవం ఆమెను ఉక్కిరిబిక్కిర చేసింది. లోపల నుంచి దుఖం తన్నకువచ్చింది. కానీ తాను ఏడిస్తే.. కొడుకు చేసిన సాహసం తక్కువవతుందని భావించిన ఆ తల్లి.. తన బాధను దిగమింగుకుంది. భోరున ఏడవాలని అనిపించినా.. అతి కష్టమ్మీద దుఖాన్ని ఆపుకుంది. అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ చేతుల మీదుగా కుమారుడికి లభించిన శౌర్యచక్ర పతకాన్ని ఆందుకుంది. (చదవండి: 'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా') ఆ తల్లి మనోవేదనకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వీరమాతకు సెల్యూట్ చేస్తున్నారు నెటిజనులు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత సారా బేగం తన వెనుక కూర్చున్న సీనియర్ మంత్రులను పలకరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ తల్లిని ఓదార్చారు. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) నాడు ఏం జరిగింది అంటే.. బారాముల్లాలోని ఓ ఇంటి వద్ద ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని అవార్డుకు సంబంధించిన ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. "బిలాల్ అహ్మద్ మాగ్రే స్వయంగా రూమ్ ఇంటర్వెన్షన్ ఆపరేషనల్ పార్టీలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అనంతరం ఆయన ఉగ్రవాదుల టార్గెట్ హౌస్‌లో చిక్కుకున్న పౌరులను ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో దాక్కున్న ఉగ్రవాది అనేక హ్యాండ్ గ్రెనేడ్లను కాల్చాడు’’. ‘‘మాగ్రేతో పాటు అతని కార్యనిర్వాహక సహచరులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఫలితంగా మాగ్రే, అతడి పార్టీ కమాండర్ ఎస్సై అమర్ దీప్, సోనూ లాల్ అనే ఒక పౌరుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి," అని ప్రశంసా పత్రంలో ఉంది. అంతేకాక తీవ్రంగా గాయపడినప్పటికీ, మిస్టర్ మాగ్రే "అత్యంత ధైర్యాన్ని ప్రదర్శించి.. గాయపడిన వారిని, ఇతర పౌరులను బయటికి తరలించాడు" అని పేర్కొంది. దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికి. స్పృహ కోల్పోయే వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నాడని పేర్కొంది. చదవండి: అంత్యక్రియల కోసం దాచిన సొమ్ము లూటీ.. పోలీసాఫీసర్‌పై ప్రశంసలు -
25 వేల మంది జవాన్ల శౌర్య చక్ర అవార్డులు వెనక్కి?!
అందరి కడుపు నింపే రైతన్న కడుపు మండింది. అందరి ఆకలి తీర్చే రైతులు నిద్రాహారాలు పట్టించుకోకుండా ఢిల్లీ సరిహద్దులోని సింఘా వద్ద చలిని సైతం లెక్క చేయకుండా ఆందోళన దీక్షలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి ఉద్యమానికి క్రీడాకారులు, కళాకారులు, రచయితలు, పౌర హక్కుల కార్యకర్తలు మద్దతు తెలిపారు. తాజాగా భారత జవాన్లు కూడా వీరి పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో 25 వేల మంది జవాన్లు శౌర్య చక్ర అవార్డులను వెనక్కి ఇచ్చేయనున్నట్లు ఓ వార్తాపత్రిక కథనం వెలువరించింది. దీనికి సంబంధించిన క్లిప్పింగులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. (ఆ పోలీస్‌కు భార్యంటే భయం! అందుకే..) దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ తప్పుడు వార్తగా కొట్టిపారేసింది. అసలు ఇప్పటివరకు కేవలం 2048 మందికి మాత్రమే శౌర్య చక్ర అవార్డులను ప్రదానం చేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అసత్య కథనాన్ని ఖండిస్తూ ట్వీట్ చేసింది. 1956 నుంచి 2019 మధ్య 2048 మంది జవాన్లు మాత్రమే శౌర్య చక్ర అవార్డులు అందుకున్నారని పేర్కొంది. కాబట్టి 25 వేల మంది జవాన్లు శౌర్య చక్ర అవార్డులను వెనక్కు ఇవ్వడమనేది ఫేక్ న్యూస్. ఎందుకంటే అంతమందికి ప్రభుత్వం శౌర్యచక్ర అవార్డులను ఇవ్వనేలేదు. (రైతు నిరసనలు: 18 రోజుల్లో 20 మంది మృతి) -
రాకేశ్, బిక్రమ్ లకు 'శౌర్యచక్ర'
శ్రీనగర్: పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ నవేద్ ను ప్రాణాలతో భద్రతా బలగాలను పట్టిచ్చిన ఇద్దరు జమ్మూకశ్మీర్ పౌరులు రాకేశ్ కుమార్ శర్మ, బిక్రమ్ జీత్ లకు ప్రతిష్టాత్మక 'శౌర్యచక్ర' పురస్కారం దక్కింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున వీరికి ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. దేశ సాహస పురస్కరాల్లో మూడో అత్యున్నత అవార్డుగా 'శౌర్యచక్ర'ను పరిగణిస్తారు. అసమాన తెగువతో ఉగ్రవాదిని పట్టుకున్న వీరిద్దరికీ 'శౌర్యచక్ర' ఇవ్వాలని జమ్మూకశ్మీర్ పోలీసులు మంగళవారం ప్రతిపాదించారు. అంతేకాదు వీరిద్దరికీ జమ్ముకశ్మీర్ పోలీసు శాఖలో ఉద్యోగాలిస్తూ అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. రాకేశ్ ను ఆపరేషనల్ గ్రౌండ్ కానిస్టేబుల్ గా నియమించారు. పాకలాయ్ ప్రాంతానికి చెందిన శర్మ ఉధంపూర్ లోని సిమ్రోలిలో నివసిస్తున్నాడు. జమ్మూలోని నానక్ నగర్ కు చెందిన బిక్రమ్ జీత్ ను ఫాలోవర్ గా అపాయింట్ చేశారు. ఈనెల 5న ఉధంపూర్ దగ్గర్లోని సిమ్రోలి గ్రామంలో నవేద్ ను పట్టుకున్నారు. తమను బందీలుగా పట్టుకున్న నవేద్ ఎదిరించి రాకేశ్, బిక్కమ్ అతడిని పట్టుకున్నారు. అతడితో పాటు వచ్చిన మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. అంతకు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. రాకేశ్, బిక్రమ్ చూపిన తెగువను జాతి యావత్తు ముక్తకంఠంతో కొనియాడింది. -
సీఆర్పీఎఫ్ అధికారికి శౌర్యచక్ర
మావోయిస్టుల ఏరివేత కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ పి.ఆర్.మిశ్రా అరుదైన ఘనత సాధించారు. దేశసేవలో సాహసవీరులకు అందించే మూడవ అత్యున్నత పురస్కారం శౌర్యచక్రను స్వీకరించిన పారామిలటరీ బలగాలకు చెందిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. గతంలో ఆయనకు ఐదు సాహస పతకాలు లభించాయి. కోబ్రా విభాగంలో కమాండో శిక్షణ పొందిన అధికారి అయిన మిశ్రాను సహచరులు టాప్‌గన్‌గా పిలుచుకుంటారు. ఆయన ఐదుసార్లు నక్సల్స్ కాల్పుల్లో గాయపడ్డారు. ఆస్పత్రిలో రెండు నెలల్లోనే కోలుకుని తిరిగి విధుల్లోకి చేరారు. మావోయిస్టు కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్న జార్ఖండ్‌లో తొమిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసుల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ప్రభుత్వం ఆయన్ను ప్రత్యేకంగా డిప్యూటేషన్‌పై పంపింది. ప్రస్తుతం జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో ఆదనపు ఎస్పీ(ఆపరేషన్స్)గా ఉన్నారు. ప్రమాదకరమైన సాహసాలకు ఆయన పెట్టిందిపేరు. నక్సల్స్ హిట్‌లిస్ట్‌లో ఉన్నా ఎక్కడా వెనుకంజ వేయలేదు. మావోయిస్టుల కమాండర్ జితేంద్ర అలియాస్ జీతును గతేడాది సెప్టెంబర్‌లో కాల్చి చంపినందుకు ఆయనకు శౌర్యచక్ర, పోలీస్ పతకం లభించాయి.