సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా కోవిడ్ వైద్యపరికరాలు, బ్లాక్‌ఫంగస్ మందుల పన్నురేట్ల తగ్గింపుపై ఈ భేటీ చర్చ జరగనుంది. అలాగే ఆక్సిజన్ కొరత, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతర వస్తువులపై జీఎస్టీ రాయితీ ఇచ్చే అంశాలను గురించి చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment