శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఘోర అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. కథువాలోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం కారణంగా మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment