
ముంబై: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా మహద్‌లో సోమవారం దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద 200 మందికి పైగా చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన పట్ల పలువురు విషాదం వ్యకం చేస్తున్నారు. ఈ సంఘటనలో గాయపడిన వారికి తక్షణ సాయం అందించాలని సీఎం ఆదేశించారు.
చదవండి: ‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’