జైంట్ వీల్‌లో ఇరుక్కున్న బాలిక జుట్టు.. పాపం నొప్పితో.. | Girls Hair Stuck In Ferris Wheel Terrifying Video | Sakshi
Sakshi News home page

జైంట్ వీల్‌లో ఇరుక్కున్న బాలిక జుట్టు.. పాపం నొప్పితో..

Published Sun, Oct 1 2023 7:49 PM | Last Updated on Sun, Oct 1 2023 7:49 PM

Girls Hair Stuck In Ferris Wheel Terrifying Video - Sakshi

అహ్మదాబాద్: జాతరలో జైంట్ వీల్ అంటే అందరికీ సరదానే. చిన్న పెద్ద తేడా లేకుండా దానిపై ఎక్కి స్వారీ చేయాలని.. ఆ మజాను తనివితీరా ఆస్వాదించాలని.. అనుకోని వారుండరు. కానీ ఆ సరదానే ఓ బాలికను మృత్యువు అంచుల వరకు తీసుకెళ్లింది.  

వినాయక చవితి సందర్బంగా గుజరాత్‌లోని దేవభూమి ద్వారాక్ జిల్లా ఖంభలియాలో జరిగిన జాతరలో ఓ బాలిక జైంట్ వీల్ ఎక్కి కూర్చుంది. కొద్దిసేపటికి ఆ భారీ జైంట్ వీల్ మెల్లిగా మొదలై సరిగ్గా రెండు రౌండ్లు తిరగ్గానే ఆ బాలిక ఉన్నట్టుండి గావుకేక పెట్టింది. జాతరలో.. అంతటి హోరులో కూడా బాలిక అరుపు స్పష్టంగా వినిపించిందంటే అర్ధం చేసుకోవచ్చు ఆ బాలిక ఎంతటి నొప్పితో అరిచిందోనని. జైంట్ వీల్ నిర్వాహకులు ఆ అరుపు చెవిన పడిన మరుక్షణంలోనే జైంట్ వీల్ ఇంజిన్ ఆపి చూస్తే రాట్నం పక్కన ఉన్న  చట్రంలో ఆ బాలిక జుట్టు ఇరుక్కుపోయింది. 

జుట్టు ఇరుక్కోగానే నొప్పితో బాలిక చాలాసేపు విలవిల్లాడిపోయింది. కొద్దిసేపటికి కొందరు యువకులు జైంట్ వీల్ ఎక్కి ఒకతను బాలిక తలను పట్టుకోగా మరో యువకుడు ఆమె జుట్టును  చాకుతో కోస్తూ ఉన్నట్టు వీడియోలో చూడవచ్చు. అందుకే ఆడవాళ్లు ఇటువంటి థ్రిల్లింగ్ స్వారీలు చేసేటప్పుడు జుట్టును ముడి వేసుకుంటే ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక ఈ వీడియోకు ఒళ్లు గగుర్పొడిచే కామెంట్లు పెట్టారు నెటిజన్లు. పొరపాటున ఆ జైంట్ వీల్ నిర్వాహకులు బాలిక అరుపు వినిపించిన వెంటనే ఆపకుంటే ఏమి జరిగి ఉండేదోనని కొందరు స్పందించారు.  

ఇది కూడా చూడండి: ఎన్సీపీ పార్టీ గుర్తు ఆయనకే సొంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement