సాక్షి, చెన్నై: తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. టీ. నగర్, గిండీ, సైదాపేట, వేలచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అదేవిధంగా కన్యాకుమారి, కాంచీపురం, మధురైలో జోరువాన కురుస్తోంది. చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. 2015 తర్వాత తొలిసారి ఆ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వరదలపై ముఖ్యమంత్రి స్టాలిన్ సమీక్ష చేపట్టారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు.
This is going to end up worse than 2015 floods.
— Naveen Natarajan (@NaveenN40919487) November 7, 2021
Location- KORATTUR#ChennaiRains #ChennaiRain pic.twitter.com/w5N2li9gAL
Tamil Nadu Chief Minister MK Stalin distributed food and relief materials to people affected due to rains in Kolathur.#ChennaiRains #Monsoon2021#TamilNaduRains pic.twitter.com/FGZvxWFS7b
— Shilpa (@Shilpa1308) November 7, 2021
Comments
Please login to add a commentAdd a comment