ఇండియన్‌ ఆర్మీ టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ | Indian Army Technical Entry Scheme 2021 Details Here | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ ఆర్మీ టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌

Published Wed, Oct 13 2021 8:04 PM | Last Updated on Wed, Oct 13 2021 8:04 PM

Indian Army Technical Entry Scheme 2021 Details Here - Sakshi

ఇండియన్‌ ఆర్మీ.. జనవరి 2022లో ప్రారంభమయ్యే 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌–46వ కోర్సుకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల శిక్షణ తర్వాత ఇంజనీరింగ్‌ డిగ్రీతోపాటు పర్మనెంట్‌ కమిషన్‌లో ఆఫీసర్లుగా నియమిస్తారు.

► మొత్తం పోస్టుల సంఖ్య: 90

► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ /తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. జేఈఈ(మెయిన్‌) 2021 పరీక్షకు  హాజరై ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

► వయసు: 16 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి. 

► ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులను ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూను 5 రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో స్టేజ్‌–1, స్టేజ్‌–2 విభాగాలు ఉంటాయి. స్టేజ్‌–1 టెస్ట్‌ ఒక రోజు మాత్రమే ఉంటుంది. స్టేజ్‌–1లో అర్హత సాధించని అభ్యర్థులు అదే రోజు వెనుదిరగాల్సి ఉంటుంది. స్టేజ్‌–1లో ప్రతిభ చూపిన వారికి స్టేజ్‌ 2 ప్రక్రియ కొనసాగిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు: డిసెంబర్‌ 2021 నుంచి ప్రారంభం

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021

► వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement