సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో ఒక్కరోజే కొత్తగా 88,600 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,992,533కు చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 1,124 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 94,503కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో యాక్టవ్ కేసుల సంఖ్య 9,56,402గా ఉంది. ఇక రికవరీల సంఖ్య 49,41,628కు చేరుకుంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీలు 38 లక్షలకు పైగా ఉండటం గమనార్హం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 16,28 శాతం ఉన్నాయి.
మరోవైపు కరోనా వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు కలసికట్టుగా యుద్ధం చేయకపోతే 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. కరోనా వైరస్ చైనాలో వూహాన్‌లో ప్రబలిన తొమ్మిది నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. (టీకా పంపిణీకి 80 వేల కోట్లు ఉన్నాయా?)
Comments
Please login to add a commentAdd a comment