బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీచేయబోయే అభ్యర్థుల సంఖ్య ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 2,613 మంది ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలు, నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో.. పోటీలో మిగిలిన అభ్యర్థుల సంఖ్యల్ని రిలీజ్ చేసింది కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం.
👉 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరంలో పోటీపడుతున్న 2,613 మంది అభ్యర్థుల్లో.. 2,427 మంది పురుష అభ్యర్థులు ఉన్నారు. 185 మంది మహిళలు, ఇతర అభ్యర్థులు ఒకరు ఉన్నారు.
👉 బీజేపీ నుంచి 224, కాంగ్రెస్ నుంచి 223, జనతాదళ్ ఎస్(జేడీఎస్) నుంచి 207, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 209, 133 మంది బీఎస్పీ, సీపీఐ నలుగురు, జేడీయూ ఎనిమిది, ఎన్‌పీపీ ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
👉 రిజిస్టర్డ్ అన్‌రికగ్నైజ్డ్ పొలిటికల్‌పార్టీస్(RUPP) కింద 685 మంది బరిలో నిల్చున్నారు.
👉 స్వతంత్ర అభ్యర్థులు 918 మంది అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
👉 16 నియోజకవర్గాల్లో.. 15 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. కాబట్టి, అక్కడ రెండు బాలెట్ యూనిట్(BU)లను పోలింగ్ కోసం ఉపయోగిస్తారు.
👉 నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం నాడు చివరిరోజు కాగా, 517 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడం గమనార్హం. అయినప్పటికీ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు రెబల్‌పోరు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
👉 మే 24వ తేదీతో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుంది. అంతకు ముందే కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది.
👉 మే 10వ తేదీన 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఒకే దఫాలో పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఫలితాలను ప్రకటించనుంది ఎన్నికల సంఘం.
ఇదీ చదవండి: ఎన్నికలు ముగిశాకే సీఎం ఎవరో నిర్ణయిస్తాం!
Comments
Please login to add a commentAdd a comment