సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌లో ఇవాళ సతీ సహగమన కామెంట్ల దుమారం చెలరేగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో చర్చను చేపట్టారు. బీజేపీ ఎంపీ సీపీ జోషి(చంద్రప్రకాశ్ జోషి) రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చను జోషి ప్రారంభించారు. అయితే..
అదే సమయంలో ఈ చిత్తోడ్‌ఘడ్(రాజస్థాన్) ఎంపీ సతీ సహగమనం ఆచారాన్ని కీర్తిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఆ సమయంలో డీఎంకే ఎంపీ ఏ రాజా.. సీపీ జోషి కుర్చీ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు. విపక్ష సభ్యుల నినాదాలతో సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.
అయితే.. వాయిదా సమయంలోనే ఆయన పలువురు ఎంపీలు, ప్రత్యేకించి మహిళా ఎంపీలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆపై సమావేశాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇక ప్రారంభమైన కాసేపటికే ప్రతిపక్షాలు మళ్లీ కేంద్ర వ్యతిరేక నినాదాలతో సమావేశాలను అడ్డుకునే యత్నం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment