న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభ ప్రసంగంపై సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఆయన ప్రసంగంపై విమర్శలు చేసిన అనంతరం తనకు బెదిరింపులు వచ్చాయని వాపోయారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎందుకు విమర్శించారని అవతలి వ్యక్తి ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.
అయితే ఆ బెదిరింపు కాల్‌పై తాను పోలీసులకు ఏం ఫిర్యాదు చేయనని చెప్పారు. ప్రధాని ప్రసంగంపై తాను చేసిన విమర్శలపై ఫోన్ చేసిన వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారని ఖర్గే చెప్పారు. ‘ప్రధానిని మీరు ఎందుకు విమర్శించారు’ అని అవతలి వ్యక్తి నిలదీసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు తెలిపారు. అయితే తనను బెదిరించిన వ్యక్తిపై పోలీసులకు ఖర్గే ఫిర్యాదు చేయలేదని తెలిపాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రిగా ఖర్గే పని చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment