Terror alert
-
భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌కు ఉగ్ర బెదిరింపులు
భారత్-ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్‌కు ఉగ్రవాద బెదింపులు వచ్చాయి. ఈ మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తానని నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ సోషల్‌మీడియాలో ఓ బెదిరింపు వీడియోను పోస్ట్ చేశాడు. మ్యాచ్‌కు అంతరాయం కలిగించాలని పన్నున్ సీపీఐ మావోయిస్ట్ పార్టీకి విజ్ఞప్తి చేశాడు. ఈ ఉదంతంతో అలర్ట్ అయిన రాంచీ పోలీసులు టెస్ట్ మ్యాచ్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనంగా వెయ్యి మంది పోలీసులను మొహరించినట్లు రాంచీ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పన్నున్‌పై బెదిరింపు కేసును నమోదు చేశారు. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఎవరీ పన్నున్.. భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌కు ఆటంకం కలిగిస్తానని బెదిరించిన పన్నున్.. కెనడా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు. ఇతను అమెరికా, కెనడా దేశాల్లో ఉంటూ పంజాబ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక ఖలిస్తాన్ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటాడు. ఇతనిపై యాంటి టెర్రర్ ఫెడరల్ ఏజెన్సీ 2019లో కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి పన్నున్ ఎన్ఐఏ నిఘాలో ఉన్నాడు. ఫిబ్రవరి 3, 2021న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు పన్నున్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2023 నవంబర్ 29న పన్నున్‌ను ప్రత్యేక నేరస్థుడిగా ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్‌లు అయిపోయాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్ట్‌ల్లో టీమిండియా విజయాలు సాధించింది. ఈ సిరీస్‌లోని నాలుగో టెస్ట్ రాంచీలో, ఐదు టెస్ట్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఐదో టెస్ట్ మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది. -
కేరళ పేలుళ్ల ఘటనలో లొంగిపోయిన వ్యక్తి అరెస్టు
తిరువనంతపురం: కేరళ వరుస పేలుళ్ల కేసులో డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు నిందితుడు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, హత్యా నేరాల కింద అతడిని సోమవారం అరెస్టు చేశారు. కన్వెన్షన్ సెంటర్లో బాంబులు పెట్టినట్లు మార్టిన్ ఒప్పుకుని త్రిసూర్ జిల్లాలో పోలీసులకు లొంగిపోయాడు. లొంగిపోయే ముందు మార్టిన్ ఫేస్బుక్లో ఒక వీడియోను విడుదల చేశాడు. యోహూవా క్రిస్టియన్ శాఖ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో వరుస పేలుళ్లను ఎందుకు పాల్పడ్డాడో వివరించాడు. క్రిస్టియన్ శాఖ (యెహూవా సాక్షులు) బృందంతో తనకు కొన్నేళ్లుగా సంబంధం ఉందని పేర్కొన్న మార్టిన్.. వారి బోధనలతో మాత్రం ఏకీభవించలేదు. వారి బోధనలు తప్పుడు మార్గంలో ఉన్నాయని పలుమార్లు హెచ్చరించినట్లు కూడా చెప్పాడు. వారి బోధనలు దేశ వ్యతిరేకమని తెలిపిన మార్టిన్.. బోధనల్లో మార్పును కోరుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ అందుకు వారు సిద్ధంగా లేదని స్పష్టం చేశాడు. ఈ కారణంగానే తాను పేలుళ్లకు పాల్పడ్డట్లు వెల్లడించాడు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని కొచ్చి నగర సమీపంలో వరుస పేలుళ్ల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మతపరమైన వేడుక జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ పేలుళ్లలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 51 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది పాల్గొన్న కలామాస్సెరీలోని జామ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పేలుళ్లు జరిగాయి. ఇదీ చదవండి: Kerala Blast: కేరళలో వరుస పేలుళ్లు -
హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం
-
కాంగ్రెస్ సీనియర్ నేతకు బెదిరింపులు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభ ప్రసంగంపై సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఆయన ప్రసంగంపై విమర్శలు చేసిన అనంతరం తనకు బెదిరింపులు వచ్చాయని వాపోయారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎందుకు విమర్శించారని అవతలి వ్యక్తి ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. అయితే ఆ బెదిరింపు కాల్‌పై తాను పోలీసులకు ఏం ఫిర్యాదు చేయనని చెప్పారు. ప్రధాని ప్రసంగంపై తాను చేసిన విమర్శలపై ఫోన్ చేసిన వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారని ఖర్గే చెప్పారు. ‘ప్రధానిని మీరు ఎందుకు విమర్శించారు’ అని అవతలి వ్యక్తి నిలదీసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు తెలిపారు. అయితే తనను బెదిరించిన వ్యక్తిపై పోలీసులకు ఖర్గే ఫిర్యాదు చేయలేదని తెలిపాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రిగా ఖర్గే పని చేసిన విషయం తెలిసిందే. -
ఢిల్లీలో కలకలం రేపుతున్న టెర్రర్ నోట్
ఢిల్లీ: ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పేలుడు చోట ఓ లేఖ లభ్యమైంది. అది హెచ్చరిస్తూ కావాలనే వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. ఆ లేఖలో ‘రోజులు లెక్కపెట్టుకోండి.. పెద్ద పత్రీకారం కోసం సిద్ధంగా ఉండండి’ అని రాసి ఉండడంతో కలకలం రేపుతోంది. అంటే రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరిపే అవకాశం ఉందని ఆ రాతను బట్టి చెప్పవచ్చు. దీనిపై ఇప్పటికే ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా హైఅలర్ట్ విధించిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం బయట జనవరి 29వ తేదీన అత్యల్ప తీవ్రత కలిగిన ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ఇది ముందస్తుగా హెచ్చరిస్తూ జరిపిన దాడిగా పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ పేలుడు చోట ‘ఇండియా హిజ్బుల్లా’ పేరుతో ఉన్న ఒక లేఖ లభించింది. దీనిలో ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కాను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఇజ్రాయెల్ రాయబారి కదలికలను పరిశీలిస్తున్నట్లు, ఇరాన్ అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫఖ్రిజాదే, ఇరాన్ కమాండర్ ఖాసిమ్ సోలైమానితో సహా కొంతమంది ఉన్నత ఇరానియన్ల హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం. మీ రోజులను లెక్కపెట్టుకోండి’ అని చేతితో రాసిన లేఖలో ఉందని తెలుస్తోంది. ‘మీ ప్రతి క్షణం మాకు తెలుసు. మీరు మీ చివరి రోజులను లెక్కించడం ప్రారంభించండి. మీరు మాత్రమే కాదు, మీ భాగస్వాములు కూడా మా రాడార్‌లో ఉన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే’ అని ఆ లేఖలో హెచ్చరించారు. ఈ లేఖను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు సంస్థలు దీనిపై ఆరా తీస్తున్నాయి. ఈ బాంబు దాడిని ఇజ్రాయెల్ దేశం కూడా ఖండించిన విషయం తెలిసిందే. దర్యాప్తుకు సహకరిస్తామని తెలిపింది. -
కోవైలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో శ్రీలంక పేలుళ్ల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి పేలుడు సంఘటనలతో సంబంధాలున్నట్లు సందేహిస్తున్న కోయంబత్తూరుకు చెందిన ఐదుగురికి చెందిన ఇళ్లు, పుస్తకాల దుకాణంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు గురువారం తనిఖీలు చేశారు. శ్రీలంకలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈస్టర్ పండుగ రోజున క్రైస్తవ ప్రార్థనామందిరాలు, స్టార్ హోటళ్లలో బాంబు పేలుళ్లు చోటుచేసుకోగా సుమారు 200 మందికి పైగా మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఐఎస్ఐ తీవ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. జహరాన్ ఐఎస్ఐ తీవ్రవాది అనే ఇందుకు ప్రధాన సూత్రధారి అని కూడా అధికారులు గుర్తించారు. అతనితో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కోయంబత్తూరుకు చెందిన కొందరు సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలడంతో ఎన్ఐఏ అధికారులు వారిపై తీవ్రస్థాయిలో ఇటీవల నిఘా పెట్టారు. జూన్‌లో కోయంబత్తూరులో ఎనిమిది చోట్ల ఎన్ఐఏ అధికారులు మెరుపుదాడులు నిర్వహించి మహమ్మద్ అజారుద్దీన్, అక్రంజిందా, షేక్ ఇదయతుల్లా, అబూబకర్, సదాం హుస్సేన్, ఇబ్రహీం ఇళ్లు, అజారుద్దీన్‌కు చెందిన ట్రావెల్స్ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మహమ్మద్ అజారుద్దీన్ కార్యాలయం నుంచి ముఖ్యమైన డాక్యుమెంట్లు, సెల్ఫోన్లు, సిమ్ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరీకార్డులు, సీడీ, డీవీడీలు, నిషేధిత పోస్టర్లు, కరపత్రాలు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. మిగతావారిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. వీరి నుంచి సేకరించిన సమాచారంతో కోయంబత్తూరులో మరో మూడుచోట్ల తనిఖీలు నిర్వహించారు. షాజహాన్, షబీబుల్లా, మహమ్మద్ హుస్సేన్ అనే వ్యక్తుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించగా పలు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. అరెస్టయిన అజారుద్దీన్ వద్ద జరిపిన విచారణలో కోయంబత్తూరు ఉక్కిడం జీఎంనగర్ మసీదు వీధికి చెందిన సదాం హుస్సేన్‌కు తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు తేలింది. దీంతో అతనికి కూడా సమన్లు పంపి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు సద్దాం హుస్సేన్ ఇంటిలో తనిఖీలు చేశారు. కేరళ రాష్ట్రం కొచ్చికి చెందిన 25 మంది ఎన్ఐఏ అధికారుల బృందం కోయంబత్తూరు పోలీసుల సహకారంతో గురువారం తెల్లవారుజాము 5 గంటల సమయంలో సదాం హుస్సేన్‌తోపాటు పలువురు అనుమానితుల ఇళ్లలోకి అకస్మాత్తుగా ప్రవేశించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు ఉదయం 10.30 గంటల వరకు సాగాయి. ఇదిలా ఉండగా, చెన్నైకల్పాక్కం సమీపం కూవత్తూరు గుండమనిచ్చేరి గ్రామానికి చెందిన సూర్య (22) ఈనెల 23వ తేదీన తిరుప్పోరూరులోని తన మేనమామ ఇంటికి వచ్చినపుడు తన స్నేహితులు దిలీప్రాఘవన్ (24), తిరుమాల్ (24), యువరాజ్ (27) జయరామన్ (26), విశ్వనాథన్ (24)లతో కలిసి 24వ తేదీన అక్కడి గంగై అమ్మన్ ఆలయ కొలను పూడిక తీశారు. అదేరోజున దిలీప్ జన్మదినం కావడంతో ఆలయ పరిసరాల్లో కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు. ఈ సమయంలో అక్కడ కనపడిన వస్తువులను చేతికి తీసుకుని తెరుస్తుండగా అది పేలడంతో సూర్య, దీలీప్ రాఘవన్ దారుణంగా మరణించారు. అలాగే చెంగల్పట్లు సమీపంలోని ఒక చెరువులో బాంబు బయటపడింది. సైనికులు, ఐపీఎస్ అధికారులకు అక్కడికి సమీపంలోని మైదానంలో తుపాకీపై శిక్షణ ఇస్తున్నందున వారిని లక్ష్యంగా చేసుకునే ఈ బాంబు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ వరుసలో గురువారం హనుమంతపురం చెరువులో ఒక ఆవు మేతమేస్తుండగా భారీఎత్తున పేలుడు పదార్థాలు బైటపడడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. కాగా, పుళల్ జైలు సూపరింటెడెంట్‌పై గురువారం దాడియత్నానికి దిగిన ఇద్దరు తీవ్రవాదులపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
పాక్ ఉగ్ర కుట్ర : పంజాబ్, రాజస్ధాన్‌లో హై అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర దాడులపై నిఘా వర్గాల సమాచారంతో పంజాబ్, రాజస్ధాన్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్, రాజస్ధాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తన ముజహిదీన్ బెటాలియన్ సైన్యం సహకారంతో చొరబాట్లను ప్రోత్సహించవచ్చన్న సమాచారంతో ఈ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పాక్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్య ఎదురైనా తిప్పికొట్టేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి ఇప్పటికే సైన్యం అదనపు సేనలను మోహరించింది. భారత్‌లో ఉగ్ర దాడులను చేపట్టేందుకు రాజస్ధాన్, పంజాబ్ సరిహద్దు ద్వారా చొరబాట్లను ప్రేరేపించేందుకు పాక్ సాఫ్ట్ టార్గెట్‌గా ఎంచుకున్నట్టు సమాచారం. పాకిస్తాన్ సరిహద్దుకు చేరువగా ఉన్న రాజస్ధాన్‌లోని జోధ్‌పూర్ వంటి ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిఘా పెంచాలని బీఎస్ఎఫ్తో పాటు వాయుసేనను నిఘా సంస్ధలు కోరాయి. మరోవైపు ఆర్టికల్ 370 రద్దుతో పుల్వామా తరహా దాడులు మరికొన్ని చోటుచేసుకుంటాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ఇమ్రాన్ వ్యాఖ్యలే పుల్వామా దాడి వెనుక పాక్ హస్తం ఉందనేందుకు ఆధారాలని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. -
జమ్మూకశ్మీర్ వెళ్లడం మానుకోండి!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, టెర్రర్ అలర్ట్ నడుమ ఆ రాష్ట్రంలో పర్యటించేవారు ‘అప్రమత్తంగా ఉండాలని’ జర్మనీ, బ్రిటన్‌తో సహా ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ దేశ పౌరులకు సూచించాయి. ఉగ్ర మూకలు తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేకంగా అమర్నాథ్ యాత్రికులను, పర్యాటకులను వీలైనంత త్వరగా లోయ నుంచి బయలుదేరాలని శుక్రవారం కోరిన సంగతి తెలిసిందే. అంతేకాక అమరనాథ్ యాత్రను ఉన్నపళంగా నిలిపివేసింది. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని.. జమ్మూకశ్మీర్‌లో ఉంటే అప్రమత్తంగా ఉండి, స్థానిక అధికారుల సలహాలను పాటించాలని తమ పౌరులకు పలు దేశాలు సూచనలు జారీ చేశాయి. ఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్ కశ్మీర్‌లోని పరిస్థితిని పర్యవేక్షిస్తూ తమ దేశ పౌరులకు హెచ్చరిక జారీచేసింది. జనావాసంతో కూడిన ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాల్లో బాంబు, గ్రెనేడ్ దాడులు, కాల్పులు లేదా కిడ్నాప్లతో హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందని, జాగ్రత్త వహించాలని కోరింది. ‘లద్దక్‌లోని పశ్చిమ ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాంతాల్లో ఒంటరిగా లేదా గుర్తు తెలియని గైడ్‌తో అస్సలు ప్రయాణించొద్దు. పాకిస్తాన్, లద్దక్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో తక్షణ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లడం మానుకోండి’ అని జర్మనీ ప్రభుత్వం తమ పౌరులకు విజ్ఞప్తి చేసింది. యుకే, జర్మనీ తమ పౌరులకు ప్రయాణ సలహా ఇచ్చిన కొద్ది నిమిషాల తరువాత, ఆస్ట్రేలియా కూడా జమ్మూ కశ్మీర్‌కు వెళ్లవద్దని తన పౌరులకు సూచించింది. -
వారి త్యాగాలకు సలాం
న్యూఢిల్లీ: 2008 ముంబై ఉగ్ర దాడుల్లో అమరులైన వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోదని, వారికి దేశం సలాం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచానికి ఉగ్రవాదం ముప్పుగా పరిణమించిన తరుణంలో దానిపై సంఘటితంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో ఆయన ప్రసంగిస్తూ.. పౌరులు, పాలనా యంత్రాంగం రాజ్యాంగాన్ని అనుసరించి నడచుకోవాలని కోరారు. పద్మావతి చిత్రం విడుదలను వ్యతిరేకిస్తూ కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉగ్ర ముప్పు గురించి కొన్నేళ్ల క్రితం భారత్ మాట్లాడినప్పుడు.. ప్రపంచంలో చాలా దేశాలు అంతగా పట్టించుకోలేదని మోదీ గుర్తుచేసుకున్నారు. ‘ప్రస్తుతం ఉగ్రవాదం వారి తలుపులు తడుతున్న సమయంలో.. ప్రపంచంలో మానవత్వం, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకమున్న ప్రభుత్వాలు ఈ సమస్యను అతిపెద్ద సవాలుగా చూస్తున్నాయి. ఉగ్రవాదం తన వికృత రూపంతో ప్రతి రోజు ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తోంది. అందుకే భారతదేశమే కాకుండా.. ప్రపంచంలోని మానవతా శక్తులన్నీ ఉగ్రభూతాన్ని ఓడించేందుకు కలిసికట్టుగా పోరాటం చేయాలి. నవంబర్ 26న మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజు ముంబైలో జరిగిన ఉగ్రదాడిని దేశం మరచిపోదు. ఆ దాడిలో మరణించిన సాహస పౌరులు, పోలీసులు, భద్రతా సిబ్బంది, ఇతరుల త్యాగాలను ఈ దేశం గుర్తుంచుకుంటుంది. వారికి సలాం చేస్తోంది’ అని పేర్కొన్నారు. 1 నుంచి సైనిక దళాలపై అవగాహన డిసెంబర్ 4న నేవీ దినోత్సవం నేపథ్యంలో యుద్ధం,ఇతర సమయాల్లో భారత నౌకాదళం పోషించిన పాత్రను ప్రధాని గుర్తు చేశారు. ‘కేవలం యుద్ధ సమయాల్లో మాత్రమే గాక.. సరిహద్దు దేశాల్లో మానవతా సాయం అందించడంలో భారత నేవీ కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోని చాలా నౌకా దళాల్లో ఎప్పటికోగానీ మహిళల్ని యుద్ధ నౌకల్లో చేర్చుకోలేదు. అయితే 800, 900 సంవత్సరాల క్రితమే భారత్‌లో చోళ రాజ్య సైన్యంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. సైనిక దళాల పతాక దినోత్సవమైన డిసెంబర్ 7 గర్వించదగ్గ రోజు. డిసెంబర్ 1 నుంచి 7 వరకూ సైనిక బలగాల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ వారమంతా సైనిక బలగాల శౌర్య పరాక్రమాలకు గుర్తుగా ప్రతి ఒక్కరూ జెండా ధరించాలి. ఆ ఫొటోల్ని # armedforcesflagday ట్వీటర్ ఖాతాకు పోస్టు చేయవచ్చు’ అని మోదీ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగానికి కట్టుబడటం బాధ్యత పౌరులు, పాలనా యంత్రాంగం...ఇరు వర్గాలూ రాజ్యాంగాన్ని అనుసరించి నడచుకోవాలని మోదీ కోరారు. ‘రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం మనందరి బాధ్యత. రాజ్యాంగం ప్రకారమే ప్రజలు, పాలకులు నడచుకోవాలి. ఏ ఒక్కరికీ హాని జరగకూడదన్న సందేశాన్ని మన రాజ్యాంగం ఇస్తోంది. సమానత్వం, సున్నితత్వం అనేవి రాజ్యాంగంలోని అద్వితీయ భావనలు. వాటి వల్లే ప్రతి ఒక్క పౌరుడికీ ప్రాథమిక హక్కులున్నాయి. ఆ హక్కులను రాజ్యాంగమే కాపాడి, ప్రజల ప్రయోజనాలకు రక్షణగా ఉంటుంది’ అని ప్రధాని వెల్లడించారు. 2022 నాటికి యూరియా వాడకాన్ని తగ్గించాలి డిసెంబర్ 5న ప్రపంచ మట్టి దినోత్సవాన్ని గుర్తు చేస్తూ.. ప్రపంచంలో సారవంతమైన భూమే లేకపోతే ఏం జరుగుతుందో? అని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రపంచంలో మట్టి లేకపోతే మొక్కలు, చెట్లు పెరగవు.. ఎక్కువ యూరియా వాడడంతో భూమికి తీవ్ర నష్టం జరుగుతోంది. 2022 నాటికి ప్రస్తుత యూరియా వాడకాన్ని సగానికి తగ్గించేలా మన రైతులు తీర్మానం చేయాలి’ అని కోరారు. దివ్యాంగులు అన్ని రంగాల్లోను అద్భుత ప్రతిభ చూపుతున్నారని మోదీ కొనియాడారు. ‘రియో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు , అంధుల క్రికెట్లో టీ20 విజేతగా నిలిచారు. అనేక సామాజిక కార్యక్రమాల్లో దివ్యాంగులు విశేష కృషి చేస్తూ పోటీ పడుతున్నారు’ అని ప్రధాని అన్నారు. తన గ్రామాన్ని బహిర్భూమి రహితంగా మార్చేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన 8 ఏళ్ల బాలుడు తుషార్ తీసుకున్న నిర్ణయాన్ని మోదీ ప్రశంసించారు. -
బాత్రూమ్లో నటుడి చర్యతో కలకలం!
ప్యారిస్: మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఓ నటుడు బాత్రూమ్లో చేసిన పనికి ఫ్రాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకీ, ఆయుధాలు అంటూ బాత్రూమ్లో మాట్లాడిన అతడిని ఉగ్రవాదిగా భావించి అదుపులోకి తీసుకున్నారు. ఆపై అతడు నటుడని, మూవీ డైలాగ్ ప్రాక్టీస్‌లో భాగంగా కొన్ని పదాలు వాడినట్లు తెలుసుకుని విచారణ అనంతరం వదిలేశారు. అసలే 2015 నవంబర్‌లో జరిగిన మారణహోమాన్ని ఫ్రాన్స్ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో ఓ హాలీవుడ్ మూవీలో నటిస్తున్న పర్షియాకు చెందిన ఆర్టిస్ట్(35) మార్సెల్లీ నుంచి ప్యారిస్ వెళ్లే మెట్రో రైలెక్కాడు. కొద్దిసేపటి తర్వాత బాత్రూమ్లోకి వెళ్లిన నటుడు తుపాకులు, ఆయుధాలు అంటూ కొన్ని పదాలను ఇంగ్లీష్‌లో, డచ్ భాషలో పదే పదే ఉచ్చరించాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు మెట్రో రైలులో ఉగ్రవాది ఉన్నాడంటూ టికెట్ ఎగ్జామినర్‌కు సమాచారం అందించారు. ఆయన బాత్రూమ్ వద్దకు వచ్చి విషయాన్ని నిర్ధారించుకున్నాడు. వెంటనే రైల్వే పోలీసులు, ఆర్మీ సిబ్బందిని అలర్ట్ చేశాడు. 2015 నవంబర్‌లో ఐసిస్ ఉగ్రదాడులు జరిగి 130 మందికి పైగా మృత్యువాత పడ్డ తర్వాత అక్కడ స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. రెండేళ్లలోపే మరోదాడి జరుగుతుందోమోనని భావించిన భద్రతా సిబ్బంది ప్యారిస్ లో హై అలర్ట్ ప్రకటించిన అనంతరం ఆర్టిస్ట్ ను అదుపులోకి తీసుకుని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. కామిక్ క్యారెక్టర్స్ చేసే ఆ వ్యక్తి తాను హాలీవుడ్ మూవీలో నటిస్తున్నానని, అందులో భాగంగానే డైలాగ్స్ ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. కంపార్ట్ మెంట్లో డైలాగ్స్ గట్టిగా చదువుతూ ప్రాక్టీస్ చేస్తే తోటి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుందని ఈ పని చేశానని వివరణ ఇవ్వడంతో అతడిని విడిచిపెట్టారు. అతడు ఉగ్రవాది కాదని, నటుడని.. ఆందోళన అక్కర్లేదని పోలీసులు మీడియాకు వెల్లడించారు. -
పఠాన్‌కోట్‌లో హై అలర్ట్
పఠాన్‌కోట్: ఉగ్రవాదులు మరోసారి పంజాబ్ సరిహద్దు జిల్లాలు పఠాన్‌కోట్, గురుదాస్ పూర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నిఘా వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు ఈ రెండు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా బటాలా పట్టణంలో శనివారం ఆర్మీ, బీఎస్ఎఫ్ సిబ్బంది భారీ ఎత్తున మోహరించి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసిన నిఘా వర్గాలు ఉగ్రవాదులు భారీ ఎత్తున విధ్వంసానికి కుట్రపన్నినట్లు గుర్తించారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారం నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. జనవరి 2న పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఆ పదిమందిలో ముగ్గురిని మట్టుబెట్టారు!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి కొన్నిరోజుల కిందట భారత్‌లోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదుల జాడను భద్రతా దళాలు పశ్చిమ భారతంలో గుర్తించినట్టు సమాచారం. ఆ పదిమంది ఉగ్రవాదుల్లో ముగ్గురిని గుర్తించి భద్రతా దళాలు మట్టుబెట్టాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శివరాత్రి సందర్భంగా 26/11 ముంబై దాడుల తరహాలో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంపై ఉగ్రవాద దాడికి వారు వ్యూహరచన చేశారని ఆ వర్గాలు చెప్పాయి. పదిమంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు గుజరాత్‌లోకి ప్రవేశించారని, వారు దేశ రాజధాని న్యూఢిల్లీపై దాడి చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఢిల్లీలో తలదాచుకొని ఉంటారని ఐబీ అప్పట్లో పేర్కొంది. భారత్‌లోకి పది మంది ఉగ్రవాదులు ప్రవేశించారని పాకిస్థాన్ జాతీయ భద్రత సలహాదారు నాసిర్ ఖాన్ జాంజువా మొదట భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సమాచారమిచ్చారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు గుజరాత్‌తోపాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని జాంజువా తెలిపారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన నిఘా వర్గాలు, భద్రతా దళాలు ఢిల్లీ, గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు పశ్చిమ భారతంలో ఆ పదిమంది ఉగ్రవాదుల జాడను కనిపెట్టి.. అందులో ముగ్గురిని హతమార్చినట్టు సమాచారమందుతున్నది. -
ముంబై స్టేషన్లపై టెర్రరిస్టుల టార్గెట్?
ముంబై: ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్లకు టెర్రరిస్టు ముప్పు పొంచి ఉందనే సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలోకి సముద్ర మార్గం ద్వారా లష్కరే తాయిబా ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దీనికి సంబంధించి సోమవారం స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులు సుమారు 10 మంది ముంబై రైల్వేస్టేషన్లను టార్గెట్ చేశారనే సమాచారంతో ఈ అలర్ట్ జారీ చేశారు. దీంతో 17 స్టేషన్లకు ఆర్పీఎఫ్ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలను ముమ్మరం చేశారు. దేశంలో సంచలనం సృష్టించిన 2008 వరుస పేలుళ్లు, 26/11 దాడులకు అబూ యాకూబ్ బాధ్యుడన్న సంగతి తెలిసిందే. సముద్రమార్గం గుండా వచ్చి దాడులు చేయడం అతడి ఆపరేషన్ స్టైల్. ప్రస్తుతం తప్పించుకుని తిరుగుతున్న యాకూబ్ పాకిస్తాన్‌లోని కరాచీ ద్వారా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. -
హిందూనేతలపైనే
చెన్నై, సాక్షి ప్రతినిధి :రాష్ట్రంలో మూడేళ్లుగా తీవ్రవాదుల కదలికలు ఎక్కువయ్యూయి. ప్రముఖ హిందూ నేతలు ఎందరో వారి దాడులకు బలయ్యూరు. ఆయా కేసుల్లో కొందరు పట్టుబడి జైళ్లలో ఉండగా, మరి కొందరు అజ్ఞాతంలో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. బస్సు, రైలు, విమాన ప్రయాణాల కంటే రాష్ట్రం వెంబడి ఉన్న సముద్ర మార్గం సురక్షితమని తీవ్రవాదులు భావిస్తున్నారు. దీంతో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తరచూ రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేస్తున్నాయి. మత్స్యకార గ్రామాలపై పోలీసులు నిఘా పెడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఏమూల ఎక్కడ ఏమి జరుగుతుందోననే ఆందోళన పోలీసు యంత్రాంగాన్ని వెంటాడుతోంది. ఈ దశలో అల్-ఉమాకు చెందిన ముగ్గురు మాజీ తీవ్రవాదులు రెండు రోజుల క్రితం చెన్నై పోలీసులకు పట్టుబడ్డారు. కాశీమేడు ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రమార్గంలో పరారయ్యేం దుకు ప్రయత్నిస్తున్న మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ 18న తిరువళ్లూరు హిందూ మున్నని నేత సురేష్‌కుమార్‌ను హత్యచేసింది తామేనని పట్టుబడిన అంబత్తూరు పాడికి చెందిన నజీర్ (28), కడలూరుకు చెందిన ఖాజా మొహిద్దీన్ (32), కుతుబుద్దీన్ (30) అంగీకరించారు. అంతేగాక మరికొందరిపై తాము గురిపెట్టినట్లు వాంగ్మూలం ఇవ్వడం పోలీసులను కలవరపెట్టింది. పోలీసుల కథనం ప్రకారం, నిందితులు గతంలో నగరంలోని దుకాణాల్లో గుమాస్తాలుగా పనిచేస్తూ జీవించేవారు. వీరిని కొందరు తీవ్రవాదులు తీసుకెళ్లి బ్రెయిన్‌వాష్ చేసి తీవ్రవాదులుగా మార్చినట్లు విచారణలో తేలింది. తీవ్రవాదులుగా ఉంటే ఎక్కువ మొత్తం ముట్టుతుందనే ఆశను వారికి కల్పించారు. హిందూ నేతల కదలికలు చేరవేస్తే చాలని అగ్రనేతలు వీరిని ఆదేశించారు. ఈ పథకం ప్రకారమే సురేష్‌కుమార్ హత్య జరిగింది. హత్యల వెనుక అసలు సూత్రధారి ఖాజామొహిద్దీన్ వంటి తీవ్రవాదులు ఇంతవరకు పట్టుబడలేదు. ఇంకా కొందరు హిందూ నేతలను హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తేలగా, అజ్ఞాతంలో ఉన్న తీవ్రవాదులు దొరికితేగానీ వారి చిట్టాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పటికే తిరువళ్లూరులో హిందూ మున్నని నేత సురేష్‌కుమార్, సేలంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆడిటర్ రమేష్ హత్యకు గురయ్యూరు. వీరి హత్యల్లో ఇప్పటికే గతంలో ముగ్గురు, తాజాగా మరో ముగ్గురు అరెస్టయ్యూరు. అజ్ఞాతంలో ఉన్న తీవ్రవాదుల వల్ల ముప్పు ఏర్పడకుండా హిందూనేతలకు ఇప్పటికే ఉన్న పోలీసు బందోబస్తును మరింత పెంచారు. -
అలర్ట్
సాక్షి, చెన్నై:రాష్ట్ర రాజధాని నగరం చెన్నై తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న దృష్ట్యా, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తోంది. కేంద్రం నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు నిఘాను అప్రమత్తం చేస్తున్నారు. అయితే, ఇటీవల రాష్ట్రంలో వెలుగు చూస్తున్న పరిణామాలు భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బెంగళూరు బాంబు పేలుళ్ల కేసు రాష్ట్రం చుట్టూ తిరగడం, అజ్ఞాత తీవ్రవాదులు పట్టుబడడంతో చాప కింద నీరులా సంఘ విద్రోహ శక్తులు కార్యకలాపాలు సాగిస్తున్నాయూ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నయి. మరో తీవ్రవాది అబుబక్కర్ సిద్ధిక్ జాడ ఇంత వరకు కానరాలేదు. విదేశాల నుంచి నకిలీ వీసాలతో, నకిలీ పాస్ పోర్టులతో చెన్నైకు వచ్చి పట్టుబడుతున్న వారి సంఖ్య, బ్లాక్ మనీ, బంగారం స్మగ్లింగ్ పెరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల నేపాల్‌లో పట్టుబడిన ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్ర వాది యాసిన్ భత్కల్ చెన్నైలో రెక్కీ నిర్వహించినట్టుగా గతంలో ప్రచారం సాగింది. ఈ పరిస్థితుల్లో తాజాగా అదే తీవ్రవాది విడుదలకు డిమాండ్ చేస్తూ విమానాల హైజాక్‌కు ముష్కరులు కుట్ర చేసినట్టుగా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తూ కేంద్రం ఆదేశించింది. నిఘా నీడలో: రాష్ట్రంలోని చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం అతి పెద్దది. ఇటీవలే సరికొత్త హంగులతో ఈ విమానాశ్రయం రూపు రేఖల్ని మార్చారు. జాతీయ, అంతర్జాతీయ విమానాలకు వేదికగా ఉన్న ఇక్కడ భద్రత ఎప్పుడూ కట్టుదిట్టంగానే ఉంటుంది. అయితే, కేంద్రం నుంచి ఏదేని హెచ్చరికలు వచ్చిన పక్షంలో మాత్రం నిఘాను మరింత పెంచుతుంటారు. ఆ దిశగా విమానాశ్రయం పరిసరాల్ని నిఘా నీడలోకి తెచ్చారు. అక్కడి నిఘా నేత్రాల ద్వారా కంట్రోల్ రూంల నుంచి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. కేంద్ర ఆయుధ బలగాలు, రాష్ట్ర పోలీసులు తనిఖీల్లో నిమగ్నం అయ్యాయి. ప్రతి విమానాన్ని, ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. విమానాశ్రయంలోకి వచ్చే వాహనాలకు ఆంక్షలు విధించారు. తనిఖీల అనంతరం లోనికి అనుమతిస్తున్నారు. సందర్శకుల అనుమతికి ఈనెలాఖరు వరకు బ్రేక్ వేశారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటుగా, మదురై, తిరుచ్చి, కోయంబత్తూర్, తూత్తుకుడి, సేలం విమానాశ్రయాల్లోను భద్రతను కట్టుదిట్టం చేశారు.