
దిస్పూర్: మణిపూర్‌లో గురువారం జరిగిన ఉగ్ర దాడిలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ముగ్గురు సైనికులు మరణించగా..మరో ఆరుగురు గాయపడ్డారు. చందేల్ జిల్లాలో స్థానిక పీపుల్స్ లిబరేషన్ పార్టీకి చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడినట్టు సమాచారం. ఉగ్రవాదులు తొలుత ఐఈడీతో దాడి చేసి ఆపై అస్సాం రైఫ్సిల్ సైనికులపై కాల్పులు జరిపారు. ఘటన జరిగిన ప్రాంతం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘటనా ప్రాంతానికి అదనపు బలగాలను తరలించామని అధికారులు వెల్లడించారు.