
సాక్షి, మైసూరు(కర్ణాటక): దుష్ట సంహారం చేయాలని చాముండేశ్వరి అమ్మవారిని కోరుకున్నా, అతి త్వరలోనే ఇది జరుగుతుందని నమ్మకం ఉందని బీజేపీ రెబెల్ ఎమ్మెల్యే బసవనగౌడ యత్నాల్ అన్నారు. సోమవారం మైసూరు చాముండికొండపై ఆయన అమ్మవారిని దర్శించుకొన్నారు.
తరువాత మీడియాతో మాట్లాడుతూ పరోక్షంగా సీఎం యడియూరప్పపై ఆరోపణలు సంధించారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న కొంత మంది దుష్టులను సంహరించాలని ప్రార్థించానన్నారు. పార్టీ నాయకత్వం అంతా గమనిస్తోందని, త్వరలోనే దీనికి అంతం పలుకుతుందని అన్నారు.