లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నీట్ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నీట్‌కు హాజరైన 28,38,596 మందికి గానూ.. 11,45,976 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు.
ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన బోర వరుణ్ చక్రవర్తితో పాటు.. తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌కు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 720 మార్క్‌లతో ఇరువురికీ సంయుక్తంగా ఫస్ట్ ర్యాంక్ దక్కింది.
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం 20 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో నీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. జూన్ 4న ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ).. దీనిపై జూన్ 6వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment