PG Results
-
నీట్ యూజీ ఫలితాలు విడుదల.. ఏపీ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నీట్ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నీట్‌కు హాజరైన 28,38,596 మందికి గానూ.. 11,45,976 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన బోర వరుణ్ చక్రవర్తితో పాటు.. తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌కు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 720 మార్క్‌లతో ఇరువురికీ సంయుక్తంగా ఫస్ట్ ర్యాంక్ దక్కింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం 20 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో నీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. జూన్ 4న ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. దీనిపై జూన్ 6వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. -
నీట్లో మెరిసిన రైతుబిడ్డలు
కర్నూలు: నీట్ పీజీ ఫలితాల్లో రైతు బిడ్డలు ప్రతిభ చూపారు. మంగళవారం సాయంత్రం వచ్చిన ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన చెన్నూరు హుసేని, చెన్నూరు హుసేనమ్మలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో కుమార్తె రజియా అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేయాలన్న సంకల్పంతో నీట్ పరీక్షలు రాయగా 571 మార్కులు వచ్చాయి. ఆలిండియా స్థాయిలో 5248వ ర్యాంకు వచ్చింది. చిన్నపిల్లల వైద్యనిపుణురాలిగా మంచి పేరు తెచ్చుకుని పేదలకు సేవచేయాలన్నదే తన లక్ష్యమని ఈమె తెలిపారు. -
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ ఫలితాలు విడుదల
విజయవాడ (ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ) : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మే నెలలో నిర్వహించిన ఫిజియోథెరపీ (ఎంపీటీ పార్టు-2) పీజీ ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల రీ-టోటలింగ్ కోసం ఈ నెల 17వ తేదీలోగా సబ్జెక్టుకు రూ.2వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్ తెలిపారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్సైట్ http://ntruhs.ap.nic.in లో పొందవచ్చు. -
నాగార్జున వర్సిటీ పీజీ ఫలితాలు విడుదల
గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ చివరి సెమిస్టర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏప్రిల్‌లో జరిగిన ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నాలుగో సెమిస్టర్ ఫరీక్షా ఫలితాలను విడుదల చేసినట్టు చీఫ్ ఎగ్జామినర్ ఎం.సాయిబాబా తెలిపారు. ఫలితాలను www.anu.ac.in వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చునన్నారు. జూన్ 3వ తేదీలోపు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.