విజయవాడ (ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ) : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మే నెలలో నిర్వహించిన ఫిజియోథెరపీ (ఎంపీటీ పార్టు-2) పీజీ ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల రీ-టోటలింగ్ కోసం ఈ నెల 17వ తేదీలోగా సబ్జెక్టుకు రూ.2వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్ తెలిపారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్సైట్ http://ntruhs.ap.nic.in లో పొందవచ్చు.