ఢిల్లీ: అభివృద్ధి నినాదంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదని అన్నారు. వరుసగా మూడేళ్లుగా 7 శాతం వృద్ధి రేటును సాధిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా నుంచి దేశాన్ని రక్షించామని స్పష్టం చేశారు.
బడ్జెట్‌లో నాలుగు విషయాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతులు, యువత, మహిళలు అభివృద్ధి కేంద్రంగా బడ్జెట్ రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు. ద్రవ్యలోటును 4.5కు తగ్గించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. సరైన విధానాలు, నిర్ణయాలతోనే ముందుకు వెళ్తున్నామని అన్నారు.
జీడీపీ ఏం సాధించామో స్పష్టంగా చెప్పామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పాలనలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని చెప్పారు. మూడు రైల్వే కారిడార్లను నిర్మిస్తున్నామని తెలిపారు. మెట్రో, నమో భారత్ కనెక్టివిటీ పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల జీవణ ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయని తెలిపారు.
ఇదీ చదవండి: Budget 2024 Live Updates Telugu: బడ్జెట్ సమావేశాలు అప్‌డేట్స్..
Comments
Please login to add a commentAdd a comment