Union Minister Piyush Goyal 30th Marriage Anniversary: Pics Goes Viral - Sakshi
Sakshi News home page

‘నువ్వు నన్ను పరిపూర్ణం చేశావు’.. కేంద్ర మంత్రి ట్వీట్‌ వైరల్‌

Published Wed, Dec 1 2021 3:21 PM | Last Updated on Wed, Dec 1 2021 3:47 PM

Piyush Goyal Tweet Viral On His 30th Wedding Anniversary - Sakshi

న్యూఢిల్లీ: రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు 24/7 బిజీగా ఉంటారు. తమ గురించి ఆలోచించుకోవడానికే వారికి తీరిక ఉండదు. అలాంటిది ఇంట్లోవారి పుట్టిన రోజులు, తమ పెళ్లి రోజు వంటివి గుర్తించుకోవడం అంటే నిజంగా గ్రేటే. శుభాకాంక్షలు చెప్తే.. అదే పెద్ద బహుమతిగా భావిస్తారు అవతలివారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ భార్య కూడా ఇలానే ఫీలవుతున్నారు. వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా పీయూష్‌ గోయల్‌ శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
(చదవండి: అప్పుడే పదేళ్లు.. తాజ్‌మహల్‌ వద్ద బన్నీ, స్నేహ హల్‌చల్‌)

కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ పెళ్లి రోజు సందర్భంగా భార్య సీమతో కలిసి ఉన్న రెండు ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఫోటోలతో పాటు ఆయన పెట్టిన క్యాప్షన్‌కి నెటిజనులు ఫిదా అయ్యారు. ‘‘నువ్వు నన్ను పరిపూర్ణం చేశావు సీమ.. 30వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ పెళ్లి సందర్భంగా తీసిన ఫోటో.. తాజాగా దిగిన ఫోటోలను షేర్‌ చేశారు పీయూష్‌ గోయల్‌.
(చదవండి: Jr NTR Marriage Day: వైరలవుతున్న పెళ్లి పత్రిక)

ఈ ఫోటో చూసిన నెటిజనుల.. ‘‘పీయూష్‌ గోయల్‌ సార్‌కి భార్య అంటే ఎంత అభిమానం.. ఒక్క మాటతో ఆయన జీవితంలో ఆమె స్థానం ఏంటో ప్రపంచానికి తెలిపారు. భార్యను ఇంతలా గౌరవించడం నిజంగా అభినందనీయం’’ అంటూ నెటిజనులు ప్రశంసిస్తున్నారు. కేంద్రం మంత్రి నితిన్‌ గడ్కరి, భూపేంద్ర యాదవ్‌ తదితరులు పీయూష్‌ గోయల్‌ దంపతులుకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

చదవండి: ‘‘ఎలా మొదలైంది..ఎలా కొనసాగుతోంది’’ భావోద్వేగ పోస్ట్‌ వైరల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement