
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి ప్రపంచానికి విసిరిన సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ ప్రపంచానికి బాసటగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ దేశంగా భారత్ ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు తన సామర్ధ్యాలను పూర్తిగా వినియోగించుకుని మానవాళికి సాయంగా నిలుస్తుందని చెప్పారు. 150 దేశాలకు భారత ఫార్మా పరిశ్రమ అత్యవసర ఔషధాలను పంపిందని ప్రధాని గుర్తుచేశారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) భేటీ సందర్భంగా మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు.
ఎస్‌సీఓ దేశాలతో భారత్‌కు దృఢమైన సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ భేటీలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సహా పలువురు నేతలు పాల్గొని కోవిడ్-19తో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని నిరోధించే చర్యలపై చర్చించారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోనే వ్యూహాలపైనా నేతలు సంప్రదింపులు జరిపారు. చదవండి : ‘దీపావళికి స్థానిక ఉత్పత్తులే కొనండి’
Comments
Please login to add a commentAdd a comment