సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారీ వర్షాలతో నీటి నిల్వలు, భూగర్భ జలాల్లో పుష్కలంగా పెరగడంతో రబీ సీజన్‌లో దేశంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే నవంబర్ రెండో వారానికి 6 శాతం పెరుగుదల ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. గతేడాది 1.68 కోట్ల హెక్టార్లలో సాగు చేయగా ఈసారి 1.80 కోట్ల హెక్టార్లను దాటింది. ‘‘గోధుమల సాగు 41 లక్షల హెక్టార్ల నుంచి అది ఇప్పటికే 46 లక్షలకు చేరవైంది.
వరి 6 లక్షల హెక్టార్ల నుంచి 7.5 లక్షలకు పెరిగింది. పప్పు ధాన్యాల విస్తీర్ణం గతేడాది 55.41 లక్షల హెక్టార్ల కంటే స్వల్పంగా తగ్గింది’’ అని పేర్కొంది. పంజాబ్, మధ్య ప్రదేశ్ లో వరి కోతలు సాగుతుండటంతో గోధు మల సాగు ఇంకా మొదలవలేదని వ్య వసాయ శాఖ చెప్పింది. తెలంగాణ సహా వరి పండించే రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమి ళనాడులో ఇప్పుడిప్పుడే వరి పంటల సాగు మొ దలైందని వెల్లడించింది. గతేడాది అన్ని పంటల సాగు విస్తీర్ణం 6.18 కోట్ల హెక్టార్లుగా నమోదైంది. ఈసారి 6.33 కోట్ల హెక్టార్ల వరకు పెరగవచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment