Rabi seasons
-
దేశవ్యాప్తంగా రబీ జోష్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారీ వర్షాలతో నీటి నిల్వలు, భూగర్భ జలాల్లో పుష్కలంగా పెరగడంతో రబీ సీజన్లో దేశంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే నవంబర్ రెండో వారానికి 6 శాతం పెరుగుదల ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. గతేడాది 1.68 కోట్ల హెక్టార్లలో సాగు చేయగా ఈసారి 1.80 కోట్ల హెక్టార్లను దాటింది. ‘‘గోధుమల సాగు 41 లక్షల హెక్టార్ల నుంచి అది ఇప్పటికే 46 లక్షలకు చేరవైంది. వరి 6 లక్షల హెక్టార్ల నుంచి 7.5 లక్షలకు పెరిగింది. పప్పు ధాన్యాల విస్తీర్ణం గతేడాది 55.41 లక్షల హెక్టార్ల కంటే స్వల్పంగా తగ్గింది’’ అని పేర్కొంది. పంజాబ్, మధ్య ప్రదేశ్ లో వరి కోతలు సాగుతుండటంతో గోధు మల సాగు ఇంకా మొదలవలేదని వ్య వసాయ శాఖ చెప్పింది. తెలంగాణ సహా వరి పండించే రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమి ళనాడులో ఇప్పుడిప్పుడే వరి పంటల సాగు మొ దలైందని వెల్లడించింది. గతేడాది అన్ని పంటల సాగు విస్తీర్ణం 6.18 కోట్ల హెక్టార్లుగా నమోదైంది. ఈసారి 6.33 కోట్ల హెక్టార్ల వరకు పెరగవచ్చని అంచనా. -
పాతాళానికి చేరిన భూగర్భజలం
ఇక్కడ కనిపిస్తున్న పొలం మహబూబ్‌నగర్ రూరల్ మండలం మాచన్‌పల్లికి చెందిన రైతు మల్లు వెంకటేశ్వర్రెడ్డిది. ఇతనికి 20 ఎకరాల పొలం ఉంది. నాలుగు బోర్లు ఉన్నాయి. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా నాలుగు బోర్లలో రెండింట్లో నీటిమట్టం పడిపోయింది. మరో రెండు బోర్లలో అంతంతమాత్రంగానే నీళ్లు వస్తున్నాయి. ఇరవై ఎకరాల రైతు గత రబీ సీజన్లో నాలుగున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేస్తే ఈ ఏడాది రబీలో నీళ్లు లేక కేవలం అర ఎకరంలో సాగుచేస్తున్నాడు. రైతులందరికీ ఇదే పరిస్థితి. ప్రతిఏటా సాగు విస్తీర్ణం తగ్గిపోతుందనడానికి ఇదొక నిదర్శనం. వర్షాలు కురవక భూగర్భ జలాలు పడిపోతుండటంతో రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారు. కోయిల్‌సాగర్ బ్యాక్ వాటర్‌ను మహబూబ్‌నగర్ రూరల్, కోయిలకొండ మండలాల్లోని చెరువుల్లోకి నింపితే రైతులు పంటలను సాగు చేసుకునే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలో భూగర్భ జలమట్టం రోజురోజుకు పడిపోతోంది. ఆరేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా నీటిమట్టం పాతాళానికి చేరింది. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు సమస్య ఇలాగే ఉంది. 2013లో కురిసిన భారీ వర్షం తప్పా మళ్లీ ఆ స్థాయిలో వర్షాలు కురవలేదు. అప్పటి నుంచి ఈ పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే చెరువులు, కుంటలు, వాగులు, బోరుబావులు వట్టిపోయి పంటల సాగు కష్టతరంగా మారింది. ప్రస్తుత రబీ సీజన్లో సాగు చేసిన వరి, వేరుశనగ, జొన్న, శనగ తదితర పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వేసవి రాకముందే.. వేసవి రాకముందే జిల్లాలో ప్రమాద ఘంటికలు కనిపిస్తున్నాయి. సమృద్ధిగా వర్షాలు పడకపోవడం, మరోవైపు 24 గంటల విద్యుత్ సరఫరాతో బోరుబావుల్లో ఉన్న కొద్దిపాటి నీరు విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా చిన్ననీటి వనరులు చెరువులు, కుంటలు, బోరుబావులు వట్టిపోతున్నాయి. రైతులు రబీ పంటలపై ఆశలు వదులుకున్నారు. కనీసం పశువులకు నీరు దొరకే పరిస్థితి కూడా కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. అన్నం పెట్టే రైతన్నకు వివిధ పంటల సాగులో చేతినిండా పని లేకుండా పోవడంతో ఇతర పనులపై ఆధార పడాల్సి వస్తోంది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది సాగుకు నీరు వదలరాదని సంబంధిత అధికారులు క్రాప్ హాలీడే ప్రకటించారు. ఈ కారణంగా అక్కడ కూడా పంటల సాగుకు నీటి సమస్య ఎదురవుతోంది. బోరుబావుల కింద మాత్రం రైతులు సేద్యం చేస్తున్నారు. ఆ బోర్లు కూడా ఎప్పుడు ఎండిపోతాయో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి కారణాలతో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. గతంలో ఐదు ఎకరాలు సాగు చేసిన రైతులు ప్రస్తుతం రెండు ఎకరాలు కూడా సాగు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. తగ్గిన సాగు విస్తీర్ణం జిల్లాలో ఈ ఏడు రబీ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. గత ఏడాది వరి 22,500 హెక్టార్లు, వేరుశనగ 17వేల హెక్టార్లు, జొన్నలు 1000 హెక్టార్లు, శనగ వంటి చిరు ధాన్యాలు మొత్తం 1,930 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేశారు. ఈ ఏడు రబీ సీజన్లో వరి 15వేల హెక్టార్లు, వేరుశనగ 7,700 హెక్టార్లు, జొన్నలు 744 హెక్టార్లు, శనగలు 545 హెక్టార్లు, చిరు «ధాన్యాల వంటి పంటలు 1,415 హెక్టార్లు మాత్రమే సాగు చేశారు. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులంతా తమ బోరుబావుల్లో ఉన్న నీటిని బట్టి డ్రిప్ పద్ధతిని వినియోగిస్తూ ఆరుతడి పంటలు పండిస్తున్నారు. పాతాళానికి చేరిన జలం భూగర్భజలాలు లోలోతుకు పడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరీ పాతాళానికి వెళ్లిపోయాయి. ఖరీఫ్ గట్టెక్కినా రబీ పరిస్థితి దారుణంగా ఉంది. సాగునీటితోపాటు తాగునీటికీ సైతం ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలో గత సంవత్సరం జనవరిలో భూగర్భ జలాలు 11.69 మీటర్ల వద్ద ఉండగా 2019 జనవరిలో 15.87 మీటర్లకు పడిపోయాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే నీటి లభ్యత 4.18 మీటర్లకు పడిపోయింది. నారాయణపేట మండలం అప్పారెడ్డిపల్లిలో భూగర్భజలాలు మరింత లోతుకు చేరాయి. జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా ఇక్కడ 15.79 మీటర్ల లోతుకు పడిపోయాయి. అదేవిధంగా గండీడ్ మండలం సల్కార్‌పేటలో 15.10 మీటర్లు, మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలో 11.88 మీటర్లు, ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామంలో 8.65 మీటర్ల వరకు భూగర్భ జలాలు పడిపోయాయి. గత సంవత్సరం జనవరి నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు ప్రతినెలా భూగర్భ జలాలు పడిపోవడమే తప్ప పెరగలేదు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని 26 మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. వర్షాభావ పరిస్థితులు ఈ విధంగానే ఉంటే నీటి ఎద్దడి తప్పదు. వర్షపు నీటిని నిలువ చేస్తేనే.. వర్షపు నీటిని నిలువ చేయడంతో పాటు ఈ ప్రాంతం నుంచి వెళ్లే జీవనదులు, వాటికి అడ్డుగా ఆనకట్టలు కడితేనే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మీదుగా వెళ్లే వరద నీటికి అడ్డుకట్ట వేసి సద్వినియోగం చేసుకుంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం ఉంది. ఈ విషయంపై జిల్లాస్థాయి అధికారులు, పాలకులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి బోరుబావులు, చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి. నీటిని పొదుపుగా డ్రిప్‌ను వినియోగిస్తూ ఆరుతడి పంటలు, చిరు ధాన్యాలు సేద్యం చేసుకుంటే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. – సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి -
రాజకీయ గ్రహణం
►‘బ్రహ్మానందసాగర్’ రిజర్వాయర్‌తోనే నీటి సమస్యకు చెక్ ►2013లోనే పూర్తయిన ప్రాజెక్టు సర్వే ►రాజకీయ కారణాలతో పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం ►ప్రాజెక్టు పూర్తయితే 22 లక్షల మందికి తాగునీరు ►గ్రావిటీ ద్వారా నరసరావుపేటతో పాటు గుంటూరుకు... ►1.5 టీఎంసీల నిల్వతో పెరగనున్న భూగర్భ జలాలు ►ఏటా త్వరితగతిన ఖరీఫ్ ఆరంభానికి అవకాశం నకరికల్లు మండలం చేజర్ల-కుంకలగుంట గ్రామాల మధ్య రూ.65 కోట్ల వ్యయంతో 2150 ఎకరాల్లో ప్రతిపాదించిన బ్రహ్మానందసాగర్ (కాసు బ్రహ్మానందరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)కు రాజకీయ గ్రహణం పట్టింది. గత పాలకులు ప్రతిపాదించిన పనులు పూర్తిచేస్తే తమకు ప్రయోజనమేమిటనే కారణంతో ప్రాజెక్ట్ ఊసే లేకుండా చేశారు. నాగార్జునసాగర్ ద్వారా కాలువలకు విడుదలైన నీటిని ఒక చోట నింపి కరువు సమయంలో వినియోగించుకోవడం ఈ రిజర్వాయర్ నిర్మాణ ఉద్దేశం. ఈ ప్రాజెక్టు పూర్తయిఉంటే ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పేవి. నరసరావుపేటవెస్ట్: సాగునీరు లేక గత ఖరీఫ్, రబీ సీజన్లలో వేలాది ఎకరాల్లో పంటలు వేయలేక ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం వేసవిలో తాగేందుకు మంచినీరు లభ్యం కాక నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరు కార్పొరేషన్ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిని అధిగమించాలంటే కుడికాలువ పరిధిలో ఇప్పటికే ఉన్న బుగ్గవాగులాంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో పాటు మరో రిజర్వాయర్ నిర్మాణమే శరణ్యమని ఎన్ఎస్పీ ఇంజినీర్లు చెబుతున్నారు. 1250 ఎకరాల్లో 1.5 టీఎంసీల నిల్వ గత ప్రభుత్వంలో నకరికల్లు మండల పరిధిలోని చేజర్ల-కుంకలగుంట గ్రామాల మధ్య 1250 ఎకరాల్లో 1.5 టీఎంసీల సాగర్ నీటిని నిల్వచేసేందుకు బ్రహ్మానందసాగర్ పేరుతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పూర్తిచేయాలని ప్రతిపాదించారు. ఈ నిర్మాణంలో 1.5 కిలోమీటర్ల పొడవైన గట్టు(బండ్)ను అక్కడక్కడ నిర్మించాల్సి వుంది. ఈ రిజర్వాయర్‌లో నిల్వచేసే నీటితో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రతి గ్రామంలోని చెరువులు, కుంటలు, మున్సిపాల్టీలోని రిజర్వాయర్లను నింపవచ్చు. అటువంటి నీటి పరిమాణంగల రిజర్వాయర్ నిర్మాణానికి రూ.33 లక్షల వ్యయంతో సర్వే చేయాలని 2013 మార్చి 1న అప్పటి ప్రభుత్వం జీవో నం.17ను జారీ చేసింది. సర్వే పూర్తయి ప్రభుత్వానికి నివేదిక అందించడంతో పరిపాలనా ఆమోదం లభించి ఆర్థిక ఆమోదం కోసం ఫైల్ వెళ్లింది. ఆ తర్వాత సమైక్య రాష్ట్ర ఉద్యమం, అనంతరం ఎన్నికల వలన రిజర్వాయర్ పనులకు ఆర్థిక ఆమోదం లభించలేదు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో ప్రయోజనాలు... ఈ రిజర్వాయర్ పూర్తయి నీటిని నిల్వ చేస్తే భూగర్భ జలాలు పెరగడంతో పాటు గ్రావిటీ ద్వారా నరసరావుపేట, చిలకలూరిపేట మున్సిపాల్టీలు, గ్రామాల్లోని చెరువులు, కుంటలతో పాటు గుంటూరు కార్పొరేషన్ పరిధి కలుపుకొని మొత్తం 21.23 లక్షలమంది ప్రజలకు ఒక్కొక్కరికి 200 లీటర్ల చొప్పున 100 రోజులపాటు తాగునీరు అందించవచ్చని ఇంజినీర్లు అంచనావేశారు. దీంతో పాటు సాగర్ కాలువలు విడుదలయ్యే దాకా వేచి ఉండకుండా త్వరగా ఖరీఫ్ సీజన్లో రైతులు తమ పొలాలను సాగుచేసేందుకు సమాయత్తం కావచ్చు. దీనివలన ఈ ప్రాంతంలో కరువు చాయలు తొలగిపోతాయని చెబుతున్నారు. సేకరించాల్సిన భూమి 650 ఎకరాలే ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించిన కుంకలగుంట-చేజర్ల గ్రామాల మధ్యలోని 1250 ఎకరాల్లో 600ఎకరాలు ప్రభుత్వ భూమే ఉందని నివేదికలో పేర్కొన్నారు. మిగతా 650 ఎకరాలను రైతులకు సరైన మార్కెట్ రేటును అప్పగించి స్వాధీనం చేసుకుంటే రిజర్వాయర్‌ను పూర్తిచేసుకునేందుకు తగిన వెసులుబాటు లభిస్తుంది. కొంతమంది టీడీపీ నాయకుల ప్రోద్బలంతో అప్పుడు కొంతమంది రైతులు తమ పొలాలను ఇవ్వబోమంటూ ఆందోళనలు నిర్వహించారు. నకరికల్లు వద్దనున్న 270 ఎకరాల్లోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఉండగా కమీషన్లు కొట్టేసేందుకే బ్రహ్మానందసాగర్ను ప్రతిపాదిస్తున్నారంటూ టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. ఇప్పటికైనా కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న పలనాడు రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుడితే ప్రజలకు మేలు చేసిన వారవుతారు.