భోపాల్: వాలెంటైన్స్‌డే రోజు కొంత మంది ఆకతాయిలు భోపాల్‌లోని ఒక రెస్టారెంట్‌లో తప్పతాగి, హల్ చల్ చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌లోని ఆరేరా కాలనీలో ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడికి కొంత మంది ఆకతాయిలు వచ్చారు. హోటల్‌లో కావాలసిన పదార్థాలు తెప్పించుకొని సుష్టుగా తిన్నారు. మత్తుపానీయాలు సేవించారు. ఆ తర్వాత తాగిన మత్తులో అక్కడి టెబుల్స్‌ను, ప్లేట్స్‌ను విరగొట్టారు. అంతటితో ఆగకుండా అక్కడి మహిళా సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించారు. పైగా, తాము శివసేన పార్టీ కారకర్తలమని చెప్పుకొని నానా హంగామా సృష్టించారు.
ఈ ఘటనతో రెస్టారెంట్‌లో ఉన్న సామాన్య ప్రజలు తీవ్ర భయాందళనలకు గురై అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు.. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, బీజేపీ పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే మరొక గొడవలో అరెస్టు అయ్యారు. ఈ రెండు గొడవలలో కలిపి మొత్తంగా 17 మందిని అరెస్ట్ చేసినట్లు భోపాల్ పోలీసులు తెలిపారు. భోపాల్ నగరంలో లవ్‌జిహద్, హుక్కాకల్చర్ పెరిగిపోయిందని అన్నారు.
యువత చెడు వ్యసనాలకు బానిసకాకుండా ఉండాలని భారతీయ జనతా యువమోర్చా(బిజేవైయమ్) నాయకుడు అమిత్ రాథోర్ హితవు పలికారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని, ఇప్పటికైనా హోటల్స్ , రెస్టారెంట్ల నిర్వాహకులు యువతను పెడదోవపట్టించే కార్యకలాపాలను మానుకోవాలని, లేకుంటే పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment