
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం వేళ దేశ రాజధానిలో ఖలిస్థానీల రాతలు కలకలం రేపుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడిన వేళ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఖలిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు వెలువడ్డాయి. ఔటర్ ఢిల్లీ చందర్ విహార్ ప్రాంతంలోని గోడలపై ఖలిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు రాయడం కనిపించింది.
రిపబ్లిక్ డేగా రోజు జనవరి 26న ఢిల్లీలో ఖలిస్తానీ జెండాను ఎగురవేయాలని పన్నూన్ హెచ్చరించారు. ఆయన హెచ్చరిక వీడియో విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో చంద్ర విహార్ ప్రాంతంలోని గోడలపై ఖలిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు రాశారని వర్గాలు తెలిపాయి. ప్రత్యేక ఖలిస్తాన్ డిమాండ్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని నినాదాలు చేశారు. రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఢిల్లీలోని తన స్లీపర్ సెల్స్ ద్వారా పన్నూ ఇటువంటి కార్యకలాపాలను ప్రేరేపిస్తున్నాడని వర్గాలు తెలిపాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు కూడా పన్నన్ బెదిరింపులు జారీ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున మాన్‌పై దాడి చేయాలని గ్యాంగ్‌స్టర్‌లకు పిలుపునిచ్చాడని వర్గాలు తెలిపాయి. అయితే.. ఢిల్లీలో గోడలపై రాసిన నినాదాలను పోలీసులు తుడిచేసి కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ మరోసారి బెదిరింపులు
Comments
Please login to add a commentAdd a comment