
నాగ్‌పూర్: భారతీయ నేలల్లో సేంద్రియ కర్బన (ఎస్‌ఓసీ) స్థాయి గత 70 సంవత్సరాల్లో 1 నుంచి 0.3 శాతానికి పడిపోయిందని నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథార్టీ (ఎన్‌ఆర్‌ఏఏ) తెలిపింది. మృత్తిక స్వరూపం, సారం, నీటిని ఒడిసిపట్టుకోవడంలో ఎస్‌ఓసీ కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ సీఈఓ అశోక్ చెప్పారు. ఎస్‌ఓసీ స్థాయిలు భారీగా పడిపోవడం భూమిలోని అవసర సూక్ష్మక్రిములపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని, దీనివల్ల మొక్కలకు పోషకాలు అందడం తగ్గుతుందని హెచ్చరించారు. సాగు అతిగా చేయడం, ఎక్కువగా ఎరువుల వాడకం, పంటమార్పిడి లేకపోవడం వంటివి ఎస్‌ఓసీ క్షీణతకు కారణాలన్నారు. జైవిక ఎరువులను వాడడం వల్ల ఎస్‌ఓసీ స్థాయిని పెంచవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment