
లక్నో: కరోనా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఆదివారం లాక్‌డౌన్ అమలు, చేయాలని ఉత్తరప్రదేశ్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మే 15 దాకా లాక్‌డాన్ అమల్లో ఉంటుంది. యూపీలో మాస్క్ ధరించకుండా రెండోసారి పట్టుబడితే రూ.10,000 జరిమానా విధిస్తారు. మాస్క్ లేకుండా మొదటిసారి జరిమానాను రూ.1,000 పెంచారు. లాక్‌డౌన్ కాలంలో పారిశుధ్య, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తారు. వీక్లీ లాక్‌డౌన్‌లో భాగంగా మే 15 దాకా శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్యలయాలను మూసివేస్తారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల మే 15 వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ కేసులు ఒక్కరోజులో భారీగా పెరగడంతో రాష్ట్ర బోర్డు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు నిన్న రాష్ట్రం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో గురువారం 104 మరణాలు, 22,439 తాజా కేసులు నమోదయ్యాయి. లక్నో, ప్రయాగ్రాజ్, వారణాసి, కాన్పూర్ నగర్, గౌతమ్ బుద్ నగర్, ఘజియాబాద్, మీరట్, గోరఖ్‌పూర్ సహా 2 వేలకు పైగా క్రియాశీల కేసుల గల మొత్తం 10 జిల్లాల్లో రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కరోనా కర్ఫ్యూ అమలులోకి వస్తుందని యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. దేశంలో 2,17,353 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment