అన్నిదానాల్లోకెల్లా అవయవదానం గొప్పదంటారు వైద్యులు. ఎందుకంటే.. ఒకరు కన్నుమూసినా.. మరికొందరి ప్రాణాలు నిలబెట్టొచ్చు కాబట్టి. పరిస్థితులు ఎలాంటివైనా పోతూ పోతూ.. ఇంకోన్ని ప్రాణాలు నిలబెట్టినవాళ్లకు, నిలబెడుతున్నవాళ్లకు జోహార్లు. ఇదిలా ఉండగా.. ఎక్కడో దేశం చివర ఉన్న ఓ పేషెంట్ కోసం ఈ చివర ఉన్న దాత నుంచి గుండె ప్రయాణించిన ఘట్టం ఇది..
జమ్ము కశ్మీర్ శ్రీనగర్‌లో ఉండే షాజాదీ ఫాతిమా(33).. గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. నానాటికీ ఆమె పరిస్థితి దిగజారడంతో గుండె మార్పిడి తప్పనిసరిగా మారింది. ఎంజీఎం హెల్త్‌కేర్‌లో ఫాతిమాను చేర్పించి.. ఆమెకు సరిపోయే గుండె కోసం దేశం మొత్తం జల్లెడ పట్టారు.
ఈలోపు జనవరి 26న తమిళనాడు తిరుచురాపల్లిలో బ్రెయిన్ డెడ్ అయిన 18 ఏళ్ల టీనేజర్ గుండె.. ఫాతిమాకు మ్యాచ్ అయ్యింది. దీంతో గ్రీన్ కారిడార్ ద్వారా తమిళనాడు నుంచి కశ్మీర్‌కు తరలించారు. హై రిస్క్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా ఫాతిమాకు గుండెను అమర్చారు. కొన్నాళ్లకు.. పూర్తిగా కోలుకున్న ఫాతిమా సంతోషకరమైన జీవితాన్ని మొదలుపెట్టింది.
ఫాతిమా అవివాహిత. సోదరుడితో ఉంటూ కూలీ పనులు చేసుకుంటోంది. తన ఆరోగ్య సమస్యపై కనీసం మందులు కూడా కొనుక్కోలేని స్థితి ఆమెది. అందుకే ఐశ్వర్య ట్రస్ట్ అనే ఎన్జీవో ముందుకు వచ్చి సాయం చేసింది. ఫండింగ్ ద్వారా గుండె మార్పిడి చేయించింది. ప్రాణాలను నిలబెట్టే ఇటువంటి మార్పిడికి చాలామంది సమన్వయం, మద్దతు అవసరం. నిజంగా ఫాతిమా కేసు సమిష్టి కృషి ప్రతిఫలం.
Comments
Please login to add a commentAdd a comment