చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులందరినీ జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ఈ విషయమై తమిళ నాడు ప్రభుత్వం 2018లో చేసిన సిఫారసు లను ఆమోదించాలని కోరారు. నిందితులు మూడు దశాబ్దాలుగా జైలు జీవితం అనుభవి స్తున్నందున వారిని ముందుగానే విడుదల చేయాలని తాము కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజాభిప్రాయం కూడా ఇదేనని తెలిపారు. ఈ నెల 19వ తేదీన రాసినట్లుగా ఉన్న ఈ లేఖ గురువారం మీడియాకు అందింది.
రాజీవ్ హత్య కేసులో వి.శ్రీహరన్ అలియాస్ మురుగన్, అతని భార్య నళిని, శాంతన్, ఏజీ పెరియవాలన్, జయకుమార్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్ అనే దోషులకు విధించిన జైలు శిక్షను తగ్గించి ముందుగానే విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం 2018 సెప్టెంబర్‌లో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు సిఫారసు చేసిందని స్టాలిన్ గుర్తు చేశారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబర్ దాడిలో అసువులు బాసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment