మహారాష్ట్ర ఆలయంలో విషాదం..చెట్టుకూలి ఏడుగురు మృతి | Tree Falls On Tin Shed Of Temple In Maharashtra Akola Few Killed | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర ఆలయంలో విషాదం..చెట్టుకూలి ఏడుగురు మృతి

Published Mon, Apr 10 2023 7:40 AM | Last Updated on Mon, Apr 10 2023 8:12 AM

Tree Falls On Tin Shed Of Temple In Maharashtra Akola Few Killed - Sakshi

మహారాష్ట్రాలో అకోలా జిల్లాలోని ఆలయంలో పెను విషాదం చోటు చోటసుకుంది. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలులకు ఆలయంలోని ఓ భారీ  వేప చెట్టు కూలి షెడ్‌పై పడటంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో సుమారు 30 మందిదాక తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అకోలా జిల్లాలో బాలాపూర్‌ తహసీల్‌లోని పరాస్‌ గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురవడంతో బాబూజీ మహారాజ్‌ దేవాలయంలోని షెడ్‌పై వేప చెట్టు పడటంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. జేసీబీ యంత్రాలతో విరిగిన చెట్టును, కూలిన షెడ్డు భాగాలను తొలగించి.. అందులో చిక్కుపోయిన వారిని రక్షించినట్లు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు ధృవీకరించారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అరోరా జిల్లా కలెక్టర్‌ అధికారులు తెలిపారు. 
(చదవండి: కాంగ్రెస్‌కు మరో కొత్త సమస్య..నిరాహార దీక్ష చేస్తానంటున్న సచిన్‌ పైలట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement