![Two Tamil Nadu Natives Win Kerala lottery - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/31/rs.jpg.webp?itok=Mltox3t0)
అదృష్టం ఉండాలేగానీ.. డబ్బు దానంతట అదే మనల్ని చేరుకుంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ ఎలా ఎవరి తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా అలాంటి ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాల ప‍్రకారం.. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన డా.ఎం ప్రదీప్, అతని బంధువు ఎన్ రమేశ్‌కు కేరళలో రూ.10కోట్ల లాటరీ తగిలింది. అయితే, వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం విదేశం నుంచి వచ్చిన తమ బంధువును ఇంటికి తీసుకువచ్చేందుకు కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లారు. ఆ సమయంలో కేరళ విషు బంపర్ లాటరీ టికెట్ నడుస్తోంది.
ఈ క్రమంలో వారిద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓ ఏజెంట్ వద్ద లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఇక, ఈ నెల 15వ తేదీన లాటరీ డ్రాలో ఊహించని రీతిలో వీరిద్దరికి జాక్‌పాట్ తగిలింది. డ్రాలో వీరి టికెట్‌కు రూ.10కోట్ల లాటరీ తగిలింది. ఈ క్రమంలోనే లాటరీ నిర్వాహకులు వీరిని విజేతలుగా ప్రకటించారు. దీంతో వారు సోమవారం లాటరీ భవన్‌కు వెళ్లి టికెట్‌తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించి రూ.10 కోట్లు తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: 35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం
Comments
Please login to add a commentAdd a comment