ఇండోర్ : కోవిడ్-19కు చికిత్స పొందుతూ ప్రముఖ ఉర్దూ కవి రహత్ ఇందోరి (70) మంగళవారం మరణించారు. ఇండోర్‌లోని అరబిందో ఆస్పత్రిలో రోహిత్ గుండెపోటుతో కన్నుమూశారని ఆయన కుమారుడు సట్లజ్ ఇందోరి తెలిపారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో మంగళవారం ఉదయం ఆయనను ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించారని చెప్పారు. కాగా తనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఎప్పటికప్పుడు తన ఆరోగ్యంపై సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తానని రహత్ ఇందోరి ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆయన హఠాన్మరణం పలువురిని కలిచివేస్తోంది.
ప్రాథమిక లక్షణాలు బయటపడిన వెంటనే కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చిందని, త్వరలోనే ఈ వ్యాధిని తాను జయిస్తానని ఇందోరి తన తుది పోస్ట్‌లో పేర్కొన్నారు. కవిత్వంలో ఐదు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్‌లో ఆయన ఎన్నో మధురమైన పాటలను అందించారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయన రాసిన ‘బులాతి హై మగర్ జానే క నహి’ పద్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి : గుడ్‌న్యూస్ : తొలి వ్యాక్సిన్ వచ్చేసింది!
Comments
Please login to add a commentAdd a comment