urdu poet
-
Jnanpith Awards 2023: గుల్జార్, రామభద్రలకు జ్ఞానపీఠ్
న్యూఢిల్లీ: ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ప్రతిష్టాత్మక 58వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ శనివారం ఈ విషయం వెల్లడించింది. 2023వ సంవత్సరానికి గాను ఈ ఇద్దరు ప్రముఖులకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేసింది. 2022వ సంత్సరానికి గాను గోవా రచయిత దామోదర్ మౌజోకు జ్ఞానపీఠ్ లభించింది. ప్రసిద్ధ బాలీవుడ్ సినీ రచయిత, ఉర్దూ కవి సంపూరణ్ సింగ్ కాల్రా అలియాస్ గుల్జార్(89)ను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి. 2002లో సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. 2013లో దాదాసాహెబ్ ఫాలే్క, 2004లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఐదు సార్లు జాతీయ ఫిలిం అవార్డు పొందారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, మాచీస్, ఓంకారా, దిల్ సే, గురు వంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. స్లమ్‌డాగ్ మిలియనీర్‌లోని ‘జై హో’ పాటకు 2009లో ఆస్కార్ అవార్డు దక్కింది. బహుముఖ ప్రజ్ఞాశాలి రామభద్రాచార్య ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన జగద్గురు రామభద్రాచార్య(74) మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో తులసీ పీఠాన్ని స్థాపించారు. రామానంద ప రంపరలో ప్రస్తుతం ఉన్న నలుగురు జగద్గురువుల్లో ఆయన కూడా ఒకరు. రెండు నెలల వయసులో ఇన్ఫెక్షన్ వల్ల కంటి చూపు కోల్పోయారు. ఐదేళ్ల వయసులోనే భగవద్గీతను, ఎనిమిదేళ్ల వయసులో రామచరితమానస్‌ను కంఠస్తం చేశారు. రామభద్రాచార్య బహు ముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. 22 భాషల్లో మాట్లాడగలరు. సంస్కృతం, హిందీ, అవ«దీ, మైథిలీ తదితర భాషల్లో రచనలు చేశారు. 240కిపైగా పుస్తకాలు రాశారు.2015లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. -
నది దాహం
కిష్వర్ నషీద్ ఇరవయ్యో శతాబ్దపు గొప్ప స్త్రీవాద రచయిత్రి. గత ఏడాది జూన్‌తో ఎనభై ఏళ్లు నించిన కిష్వర్ పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ శహర్ లో. దేశ విభజన అనంతరం వారి కుటుంబం పాకిస్థాన్‌లోని లాహోర్‌కు వెళ్లింది. అక్కడ ఆమె ఉర్దూ, పర్షియా భాషలు చదువుకున్నారు. ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి ఆడపిల్లలను అనుమతించని రోజుల్లో చదువు కోసం కిష్వర్ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఇంట్లోనే ఉండి చదువుకుంటూ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత చదువు కొనసాగించడానికి ఇంట్లో పెద్ద సమావేశం... సుదీర్ఘ చర్చ. ఎట్టకేలకు ఆమె కాలేజ్‌లో చేరగలిగారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారామె. ఆమె రచనా వ్యాసంగం 1968లో మొదలైంది. పన్నెండు స్వీయ రచనలతోపాటు అనేక అనువాద రచనలు కూడా చేశారామె. ఆమె కలం నుంచి జాలువారిన గజల్లకు లెక్కే లేదు. ప్రపంచ సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు కిష్వర్. ఆమె రచనలు ప్రధానంగా మహిళలను ఒత్తిడికి గురి చేస్తున్న మతపరమైన విధానాల మీదనే సాగేవి. స్టార్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు, సాహిత్య విభాగంలో లైఫ్ టైమ అచీవ్మెంట్ అవార్డులతోపాటు ఇతర పురస్కారాలను కూడా అందుకున్నారు. గత ఏడాది కోవిడ్ బారిన పడి కోలుకున్న నషీద్ కోవిడ్ బారిన పడిన సమాజాన్ని అక్షరబద్ధం చేశారు. ‘దర్యా కీ తిష్ణాగీ(నది దాహం)’ పేరుతో ఉర్దూలో విడుదల చేసిన సంకలనంలో ఆమె కరోనా బారిన పడిన సమాజంలో ఆమె గమనించిన విషయాలను ప్రస్తావించారు. ఆ కవిత సారాంశం క్లుప్తంగా... డబ్బాలు నిండే రోజు ‘‘కరోనా ఆర్థిక వ్యవస్థను నిలువుగా చిదిమేసింది. ఇల్లు దాటి కాలు బయటపెట్టకపోతే రోజు గడవదు, కాలు బయటపెట్టినా పని కనిపించదు. ‘ఎవరినీ తాకవద్దు– సామాజిక దూరం పాటించాలి’ అనే మాటలను వింటూనే రోజులు వెళ్లిపోతున్నాయి. మధ్య తరగతి ఎట్టకేలకు సొంతం చేసుకున్న కారును కరోనా అమ్మేసింది. ఇంటి నుంచే పని చేయమని కోరుతోంది ప్రపంచం. ఇంట్లో కూర్చుని చేసే పనులు కాని వృత్తుల్లో వాళ్లకు పని చేసే దారి మూసుకుపోయింది. ఇంట్లో దినుసుల డబ్బాలు ఎప్పుడు ఖాళీ అయిపోతాయోనని భయం. అప్పటికే ఖాళీ అయిన డబ్బాలు... నిండే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ రోజులు లెక్కపెట్టుకుంటున్నాయి. ఎవరి ముందూ చేయి చాచలేని మొహమాటం, అగ్గిపుల్లను కూడా అరువడగలేని ఆత్మగౌరవం. పిల్లల్ని ఇంట్లోనే అట్టి పెట్టుకోవాలి, ఏమీ తోచక ఏడుస్తున్న పిల్లలను రోజంతా సంతోషపెట్టాలి. ఇంటి పద్దులు చూసుకుంటూ అరుచుకుంటూ పరస్పరం కోపంతో విరుచుకుపడుతూ భార్యాభర్తలిద్దరూ అలసిపోతున్నారు. ఎవరినీ ఏమీ అడగడం చేతరానితనం, అడగడానికి అడ్డుపడే గౌరవాల మధ్య జీవితాలు నలిగిపోతున్నాయి. వాస్తవాలను అర్థం చేసుకున్న వృద్ధతరం మాత్రం ఈ కరోనా కష్టకాలానికి వారి జీవితానుభవాలను జోడించుకుని కొత్త భాష్యం చెప్పుకుంటోంది. ఇది ఇలా ఉంటే... ఇదే ఏడాది పాకిస్థాన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కొనుగోలు జరిగింది. వార్ధక్యంలో వివాహం జరిగింది. వరుడు వివాహవేదికకు కిలో బంగారంతో వచ్చాడు. యూరప్ దేశాల వాళ్లు బాల్కనీలో నిలబడి గిటార్ వాయిస్తూ గడిపారు. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. నలుగురు మనుషులున్న కుటుంబం కనిపించడం కష్టమైంది. సంగీతంలో శ్రావ్యతలన్నీ ఏకమయ్యాయి కానీ పాటలే వేరయ్యాయి. గోడను మరొక గోడ కలుపుతోంది. గోడల ఆలంబనతో జీవిస్తున్న ఇరుగుపొరుగు మధ్య పలుకు భయం మాటున మూగబోయింది. మౌనంగా సంభవించిన మరణాలు... పూడ్చి పెట్టిన బారులు చైనా గోడలాగ ఆకాశం నుంచి కూడా కనిపిస్తాయి. కరోనా దూసుకుపోతోంది... మానవత్వం మరణిస్తోంది... ఏడాది దాటి పోయింది’’. -
ప్రముఖ ఉర్దూ కవి మృతి
ఇండోర్ : కోవిడ్-19కు చికిత్స పొందుతూ ప్రముఖ ఉర్దూ కవి రహత్ ఇందోరి (70) మంగళవారం మరణించారు. ఇండోర్‌లోని అరబిందో ఆస్పత్రిలో రోహిత్ గుండెపోటుతో కన్నుమూశారని ఆయన కుమారుడు సట్లజ్ ఇందోరి తెలిపారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో మంగళవారం ఉదయం ఆయనను ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించారని చెప్పారు. కాగా తనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఎప్పటికప్పుడు తన ఆరోగ్యంపై సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తానని రహత్ ఇందోరి ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆయన హఠాన్మరణం పలువురిని కలిచివేస్తోంది. ప్రాథమిక లక్షణాలు బయటపడిన వెంటనే కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చిందని, త్వరలోనే ఈ వ్యాధిని తాను జయిస్తానని ఇందోరి తన తుది పోస్ట్‌లో పేర్కొన్నారు. కవిత్వంలో ఐదు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్లో ఆయన ఎన్నో మధురమైన పాటలను అందించారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయన రాసిన ‘బులాతి హై మగర్ జానే క నహి’ పద్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి : గుడ్‌న్యూస్ : తొలి వ్యాక్సిన్ వచ్చేసింది! -
జిలానీ బానోకు ‘ఎన్టీఆర్ సాహితీ’ పురస్కారం
► 28న రవీంద్రభారతిలో అవార్డు ప్రదానం ► నందమూరి లక్ష్మీపార్వతి వెల్లడి హైదరాబాద్: నందమూరి తారక రామారావు విజ్ఞాన ట్రస్ట్ ఏటా ఇచ్చే ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి ఉర్దూ సాహిత్యంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ కవయిత్రి, పద్మశ్రీ అవార్డు గ్రహీత జిలానీ బానో పేరును ఎంపిక చేశారు. అవార్డు కోసం ముగ్గురితో ఎంపికైన జ్యూరీ కమిటీ ఈసారి ఉర్దూ భాషా సాహిత్యానికి ఇవ్వాలని నిర్ణయించి జిలానీ బానోను ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులకు తెలిపారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. 2006లో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ స్థాపించి అప్పటి నుంచి నిరాఘాటంగా లైఫ్ అచీవ్మెంట్ స్థాయి అవార్డును ఎన్టీఆర్ పేరుతో జాతీయ స్థాయిలో అందజేస్తున్నామన్నారు. అవార్డుతో పాటు రూ.లక్ష నగదు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో పేరు గడించిన తొమ్మిది మంది వివిధ భాషల్లో ప్రముఖ రచయితలకు ఇంతవరకు అందజేశామని చెప్పారు. ఈసారి ముగ్గురు సాహితీ ప్రముఖులైన ప్రొఫెసర్ ఖలీల్ ఖాద్రీ, డాక్టర్ శివారెడ్డి, ఓల్గాలతో జ్యూరీ కమిటీ వేశామన్నారు. ముస్లిం సంప్రదాయ కుటుంబంలో పుట్టిన రచయిత్రి జిలానీ బానో దేశ, విదేశాల్లో ఎంతో గుర్తింపు పొందారన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ... ఈ నెల 28 ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. దక్కన్ ప్రాంత ఉర్దూకు పెద్ద పీట వేస్తున్న హైదరాబాద్ నగర రచయిత్రికి అవార్డు దక్కటం ఆనందంగా ఉందన్నారు.