చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిన్నమ్మ శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా డీఎంకే పార్టీని ఓడించాలని అన్నాడీఎంకే కార్యకర్తలకు శశికళ పిలుపునిచ్చారు. జయలలిత బంగారు పాలన తమిళనాడు కొనసాగాలని ఆమె పేర్కొన్నారు. శశికళ నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే కూటముల్లో సీట్ల సర్దుబాట్లు ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకనొక సమయంలో మూడో కూటమి తలుపులు మూసుకుపోవడంతో ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’(ఏఎంఎంకే) నేతృత్వంలో నాలుగో కూటమికి చిన్నమ్మ శశికళ సిద్ధమయ్యారు. జైలు నుంచి విడుదలైన శశికళ ప్రకటనపై కార్యకర్తలు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇటీవల నటుడు శరత్‌కుమార్ చిన్నమ్మను కలిసి రాజకీయాలపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment