లక్నో: నిన్న ఉత్తరాది రాష్ట్రాల్లో కర్వా చౌత్ పండుగ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. భర్త క్షేమం కోరుతూ.. భార్యలు రోజంతా ఉపవాసం చేసి.. చంద్రుడిని చూసిన తర్వాత భర్త చేతుల మీదుగా ఉపావాస దీక్ష విరమిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ నాడు మీరట్‌లో ఓ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భర్త క్షేమం కోసం మహిళ ఉపవాసం చేస్తుండగా.. అతడు మాత్రం ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. వివరాలు.. మీరట్ నాయి బస్తికి చెందిన వినోద్ కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భార్యతో తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన వినోద్ కుమార్ కర్వా చౌత్ పర్వదినం నాడు ప్రాణాలు తీసుకున్నాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా పోలీసు అధికారి విజయ్ గుప్తా మాట్లాడుతూ.. ‘దంపతులిద్దరు తరచుగా గొడవపడుతుండేవారు. దాంతో వినోద్ కుమార్ అప్‌సెట్ అయ్యాడు. చివరకు ప్రాణం తీసుకున్నాడు’ అని తెలిపారు. ( కర్వా చౌత్; శిల్పా శెట్టిపై భర్త ఫన్నీ కామెంట్)
భర్త వేధింపులు తాళలేక..
యూపీలోనే మరో ఘటనలో ఓ వివాహిత భర్త వేధింపులు తట్టుకోలేక కర్వా చౌత్ పర్వదినం నాడు ప్రాణాలు తీసుకుంది. 29 ఏళ్ల కంచన్ భర్త వేధింపులు తట్టుకోలేక బిల్డింగ్ మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. అల్లుడి వేధింపులు తట్టుకోలేక తన కుమార్తె ఈ దారుణానికి ఒడి గట్టిందని కంచన్ తండ్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment