ఢిల్లీ:రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో నేడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఐదు డిమాండ్లను కోరినట్లు సమాచారం. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత కొంతకాలంగా నిరసన చేస్తున్నారు. ఇటీవలే ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు కూడా. ఆయనతో చర్చల అనంతరం రెజ్లర్లు తమ విధుల్లోకి చేరారు. ఐతే ఆందోళన మాత్రం విరమించలేదు.
దీంతో రెజ్లర్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రెజ్లర్ల సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, దానికోసం రెజ్లర్లను మరోసారి ఆహ్వానించానని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ రోజు అర్థరాత్రి ట్వీట్ చేశారు. కేంద్రంతో రెజ్లర్లు సమావేశమవడం ఇది రెండోసారి.
రెజ్లర్ల ఐదు డిమాండ్లు ఇవే..
1.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలి.
2.అయితే కొత్తగా ఏర్పాటు చేసిన సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉండకూడదు.
3. రెజ్లింగ్ పాలక మండలికి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి.
4. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున జరిగిన ఉద్రిక్తతలలో రెజ్లర్లపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలి.
5.లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలి.
ఇదీ చదవండి:రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రం.. ఈసారి..
Comments
Please login to add a commentAdd a comment