డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సేనా అంటే గుర్తుపట్టని వారు ఉండరు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో బైడెన్ దంపతులతో ముచ్చటిస్తున్న క్రమంలో దిగిన ఓ పిక్ తెగ వైరల్ అవుతోంది. అదీ జాన్ సేనా సిగ్నేచర్‌లా ఉండటమే అందుకు కారణం.
అయితే.. బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్లారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ముచ్చటిస్తున్న క్రమంలో ప్రధాని మోదీ చేతిని పైకెత్తారు. అచ్చం అలాగే డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సేనా కూడా చేతిని పైకెత్తుతారట. ఆ ఫొటోను స్వయంగా జాన్ సేనా తన అన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో ఆ పిక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తమ అభిమాన స్టార్ జాన్ సేనా కూడా అలాగే చేతిని పైకెత్తుతారని గుర్తుచేశారు అభిమానులు. మోదీ.. జానా సేనా సిగ్నేచర్ పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా కూడా జాన్ సేనా పోస్ట్‌పై స్పందించింది. హ్యాండ్‌షేక్ చేస్తున్న ఎమోజీ పెట్టింది.
ఈ పర్యటన అమెరికా భారత్ మధ్య సరికొత్త అధ్యయాన్ని సృష్టిస్తుందని మోదీ అన్నారు. 21వ శతాబ్దపు గతిని నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న కార్పొరేట్ సంస్థల సీఈఓలు కూడా మోదీని కలిశారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదేళ్ల, ముఖేష్ అంబానీ దంపతులు, మహేంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీకి డిన్నర్‌లో ప్రత్యేకమైన వంటకాలు వడ్డించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలపై ఈ పర్యటన ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
ఇదీ చదవండి: పాట పాడి.. మోదీ కాళ్లు మొక్కిన అమెరికన్ గాయని
Comments
Please login to add a commentAdd a comment