
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. గత మూడేళ్లుగా దేశంలో ఎక్కడా లేని రీతిలో సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న వైఎస్సార్‌సీపీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నందున ఆ రోజు రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరు కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment