
● మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
లక్ష్మణచాంద:నిర్మల్‌లో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌కు సమీపంలో తనకు భూములు ఉన్నట్లు నిరూపిస్తే వాటిని నిరూపించినవారికే రాసిస్తానని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. లక్ష్మణచాందలో రామాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణాలకు ఎంపీపీ అడ్వాల పద్మతో కలిపి మంగళవా రం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండల కేంద్రంలో రూ.50 లక్షలతో రామాలయం, రూ.30 లక్షలతో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎవ రూ చేయని ఆయుత చండీయాగం సీఎం కేసీఆర్ చేశారన్నారు. ఆ యజ్ఞం ఫలితంగానే రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెలిపారు.
ప్రజాదరణ ఓర్వలేక తప్పుడు ఆరోపణలు..
బీఆర్‌ఎస్ పార్టీకి, స్థానికంగా తనకున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక విపక్ష నాయకులు తనపై తప్పు డు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి స్థలం తాను ఎంపిక చేయలేదన్నారు. రాష్ట్రస్థాయి కమిటీ నివేదిక మేరకే కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. కానీ కొంతమంది స్థలం ఎంపిక విషయంలో పనిగట్టుకుని తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తన స్వగ్రామం ఎల్లపల్లి శివారులో తనకు, తన బంధువులకు భూములు ఉన్నందున ఇక్కడ కలెక్టరేట్ నిర్మాణం చేస్తున్నామని ఆరోపిస్తున్నారన్నారు. అక్కడ తనకు భూములు ఉన్నట్లు నిరూపిస్తే ఆ భూములన్నీ వాళ్లకే రాసిస్తానని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం మానేసి రాజకీయ విమర్శలు చేస్తే ప్రజలు సహించరన్నారు. కలెక్టరేట్‌కు సరైన రోడ్డు లేకపోవడంతో సమస్యను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన ఆదేశాలతో రూ.28 కోట్లతో రహదారి నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. దీనిని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వర్, మాజీ ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, సర్పంచ్ ముత్యంరెడ్డి, తహసీల్దార్ కవితరెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి అడ్వాల రమేశ్, మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గంగరాం, మండల కోఆప్షన్ సభ్యుడు సీరాజొద్దీన్, ఏవో ప్రవీణ్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment