ఉన్నత చదువులపై దృష్టి సారించాలి
● సివిల్ జడ్జి జితిన్‌కుమార్
దస్తురాబాద్: విద్యార్థులు ఉన్నత చదువులపై దృష్టి సారించాలని ఖానాపూర్ జూనియర్ జడ్జి జితిన్‌కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని కస్తూ రిబాగాంధీ కళాశాలలో లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం న్యాయవిజ్ఞన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే నేరాలు తగ్గుతాయని తెలిపారు. ప్రజలు హక్కులు ఎలా పొందుతారో, బాధ్యతలు కూడా అలానే నిర్వర్తించాలన్నారు. ప్రతీ సమస్యను పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. నేటి సమాజంలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నందున వాటిని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఉన్నత విద్యపై దృష్టి సారించి.. అనుకున్న లక్ష్యం వైపు వెళ్లాన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్సై శంకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షడు సురేశ్, సభ్యులు వెంకట్ మహేంద్ర, శివ, గోవర్ధన్, కమలాకర్, షబ్బీర్ పాషా, లక్ష్మణ్, కుదార్, వినయ్ ఎస్‌వో తిరుమల, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment